'ఎఫ్ 3'లో మాగ్జిమమ్ అల్లరి ఉంటుందట!

Update: 2021-03-17 05:30 GMT
అనిల్ రావిపూడి మంచి రైటర్ .. అంతకుమించి డైరెక్టర్. కామెడీపై ఆయనకి మంచి పట్టుంది .. ఆయన కామెడీ ఎపిసోడ్స్ ను తలచుకుని ఇప్పటికీ పడిపడి నవ్వుకుంటూనే ఉంటారు. కామెడీని ఆయన నాన్ స్టాప్ గా ఎలా నడిపిస్తారనడానికి ఇంతకుముందు ఆయన చేసిన సినిమాలే నిదర్శనం. వెంకటేశ్ - వరుణ్ తేజ్ కాంబినేషన్లో గతంలో ఆయన చేసిన 'ఎఫ్ 2' సినిమాను ప్రేక్షకులు ఇప్పటికీ మరిచిపోలేదు. ఈ కారణంగానే ఆయన ఆ సినిమాకి 'ఎఫ్ 3' పేరుతో సీక్వెల్ చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమాను గురించి ఆయన 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో ప్రస్తావించాడు.

'ఎఫ్ 2' సినిమాను చూసినవాళ్లెవరూ 'ఎఫ్ 3' సినిమాను చూసి నిరాశపడరు. ఈ సినిమాలో బోలెడు మేనరిజమ్స్ ఉంటాయి. ఇంతవరకూ 22 రోజుల షూటింగు చేశాము. ఈ సినిమాలో మాగ్జిమమ్ అల్లరి ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ సినిమా ట్రిపుల్ బొనాంజాలా ఉంటుంది. ఈ సినిమాలో ఎవరి పాత్ర ఎక్కువగా నవ్విస్తుంది అనే ప్రశ్నకు అసలు అవకాశమే ఉండదు. ఎందుకంటే ఈ సారి కాన్సెప్ట్ చాలా కొత్తగా అనిపిస్తుంది. 'ఎఫ్ 2'లో పెళ్లాల వలన వచ్చిన ఫ్రస్టేషన్ ను చూపిస్తే బాగా ఎంజాయ్ చేశారు. ఈ సారి డబ్బు వలన వచ్చే ఫ్రస్టేషన్ ను చూపిస్తాము.
Read more!

ఇక మెగాఫోన్ పట్టుకోవడానికి ముందు రైటర్ గా చాలా సినిమాలకి పనిచేశాను. కొన్ని సినిమాలకి పేరు పడింది .. మరికొన్ని సినిమాలకు పేరు పడలేదు. దురదృష్టం కొద్దీ పేరు పడిన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. అందువలన రైటర్ గా నాకు అవకాశాలు పెద్దగా రాలేదు. ఇండస్ట్రీలో హిట్లు ఉంటేనే అవకాశాలు ఇస్తారు .. లేదంటే ఇంటికి పంపించేస్తారు. రైటర్ గా అవకాశాలు లేకపోవడం వల్లనే నేను దర్శకత్వం వైపు ఎక్కువగా దృష్టిపెట్టడం జరిగింది. ఇప్పుడు నేను దర్శకుడిగా బిజీగా ఉన్నప్పటికీ, వేరే దర్శకుల సినిమాలకి రైటర్ గా పనిచేయడానికి కూడా రెడీగానే ఉన్నాను" అని చెప్పుకొచ్చాడు.




Tags:    

Similar News