‘గాలి సంపత్’ స్టోరీ చెప్పేసిన అనిల్ రావిపూడి.. గాలోడు అంటే మీనింగ్ ఇదా?
శ్రీవిష్ణు హీరోగా.. నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ టైటిల్ రోల్ లో నటించిన మూవీ ‘గాలి సంపత్’. లవ్‌లీ సింగ్ హీరోయిన్‌గా నటించారు. అనీష్ దర్శకత్వం వహించిన ఈ మూవీని.. షైన్ స్క్రీన్స్ సంస్థతో కలిసి ఇమేజ్ స్పార్క్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై ఎస్.కృష్ణ నిర్మించారు. అయితే.. ఈ సినిమాకు బ్యాక్ బోన్ గా ఉన్నారు సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. దర్శకత్వ పర్యవేక్షణ చేయడంతోపాటు ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే కూడా అందించారు అనిల్.
రాజేంద్ర ప్రసాద్, శ్రీవిష్ణు తండ్రీకొడుకులుగా నటించిన ఈ సినిమాను మహాశివరాత్రి కానుకగా మార్చి11న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది యూనిట్. దీంతో ప్రమోషన్ మొదలు పెట్టారు. ఈ క్రమంలో ఆదివారం మీడియాతో మాట్లాడింది చిత్ర బృందం. ఈ సందర్భంగా అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా కథ ప్రాణం పోసుకున్నది నా రైటర్ ఎస్.కృష్ణ దగ్గర. నేను చేసిన ప్రతి సినిమా స్టోరీ సిట్టింగ్స్‌లో తను కీలక పాత్ర పోషించేవాడు. ఆయన తొలిసారి సొంతంగా ఒక కథ రాసి, ఆయనే నిర్మాతగా మారాలనుకుని నాకు చెప్పాడు. కథ నచ్చడంతో ఆయనకి సపోర్ట్‌గా ఉన్నాను. అన్ని రకాల హంగులనూ సమకూర్చాను.’’ అని చెప్పారు అనిల్.
అయితే.. కథ ఫైనల్ అయిన తర్వాత కూడా అది తనను వెంటాడిందన్నారు అనిల్. ఈ కథలోని మ్యాజిక్ దెబ్బతినకుండా తాను కూడా ఈ మూవీ టీంతో ట్రావెల్ చేశానన్నారు. ఈ సమయంలోనే ‘గాలి సంపత్’ స్టోరీని రివీల్ చేశారు అనిల్. సహజంగా అందరూ ‘గాలి సంపత్’ అనగానే.. గాలికి తిరిగేవాడు అనుకుంటారని, కానీ ఈ కథ మాత్రం అది కాదని చెప్పారు అనిల్.
ఓ ప్రమాదం తర్వాత ఆయన గొంతులో నుంచి మాట రాదని, మాట్లాడేందుకు ప్రయత్నిస్తే.. గాలి మాత్రమే వస్తుందని, అందుకే ‘గాలి సంపత్’ అని టైటిల్ పెట్టామని చెప్పారు. ఇదే ఈ సినిమా కాన్సెప్ట్ అని చెప్పారు. ‘బాహుబలి’ సినిమాలోని కిలికిలి భాష ఎలాగైతే అందరినీ అలరించిందో.. అదేవిధంగా ఈ సినిమాలో ‘ఫిఫిఫీ’ లాంగ్వేజ్ ఎంటర్‌టైన్ చేస్తుందని చెప్పారు అనిల్. అంతేకాకుండా.. తండ్రీకొడుకుల మధ్య అందమైన భావోద్వేగం కూడా ఉంటుందని కూడా చెప్పారు.
అదేవిధంగా.. సినిమాలోని సెకండ్ హాఫ్ లోని ఇంట్రస్టింగ్ పాయింట్ కూడా రివీల్ చేశాడు రావిపూడి. గాలి సంపత్ 30 అడుగుల గోతిలో పడిపోతాడని, దాన్నుంచి ఎలా బయటకు వస్తాడు అనేది ప్రధానంగా ఉంటుందన్నారు. సినిమాల్లో ఎలాంటి ఎంటర్‌టైన్మెంట్ అయితే ఉంటుందో.. ఇందులో కూడా అదే స్థాయిలో ఉంటుందని చెప్పాడు అనిల్. టీజర్, ట్రైలర్ రెడీ అవుతున్నాయని, త్వరలోనే రిలీజ్ చేస్తామిన చెప్పారు. ఈ కార్యక్రమంలో దిల్ రాజు, ఎస్.కృష్ణ, అనీష్, షైన్ స్క్రీన్స్ అధినేతలు సాహు గారపాటి, హరీష్ పెద్ది పాల్గొన్నారు.