• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బ‌డ్జెట్లో మూడో వంతు...

బ‌డ్జెట్లో మూడో వంతు హీరో-ద‌ర్శ‌కుల‌కే!

By - Tupaki Desk
Update: 2019-11-20 17:30 GMT
స్టార్ హీరోలు - స్టార్ డైరెక్ట‌ర్ల‌ పారితోషికాలు ఆల్వేస్ హాట్ టాపిక్. మ‌న‌కు ఉన్న డ‌జ‌ను మంది స్టార్ హీరోలు.. అంతే సంఖ్య‌లో ఉన్న స్టార్ డైరెక్ట‌ర్ల‌కు భారీగా పారితోషికాలు చెల్లించాల్సి ఉంటుంద‌న్న‌ది వాస్త‌వం. పెద్ద సినిమాల‌కు100-120 కోట్ల బ‌డ్జెట్ అనుకుంటే మూడు వాటాలుగా చూసినా.. అందులో మూడో వంతు కేవ‌లం హీరో- ద‌ర్శ‌కుడి ఖాతాలోకే వెళ్లిపోయే   స‌న్నివేశం ఉంది. హీరోని చూసే టిక్కెట్టు తెగుతుంది.. అలాగే స్టార్ డైరెక్ట‌ర్ రేంజును బ‌ట్టి కూడా జ‌నం థియేట‌ర్ల‌కు వ‌స్తున్నారు. అందుకే ఆ ఇద్ద‌రిదే మెజారిటీ షేర్ గా మారింది. డిమాండ్ స‌ప్ల‌య్ సూత్రం ఆధారంగా అంత పెద్ద మొత్తాల్ని చెల్లించేందుకు నిర్మాత‌లు ముందుకు వ‌స్తుండ‌డంతో ఈ ఆట అలా సాఫీగానే సాగిపోతోంది. అయితే చివ‌ర్లో సినిమా తేడా కొట్టిన‌ప్పుడే ఈ భారీ బాదుడుపై ఆవేద‌న వ్య‌క్తం చేస్తుంటారు నిర్మాత‌లు.

అదంతా అలా ఉంటే సంక్రాంతి బ‌రిలో దిగుతున్న భారీ సినిమాల‌కు హీరో- ద‌ర్శ‌కుడు ఏక‌ మొత్తంగా పుచ్చుకునే పారితోషికాలు షాకిస్తున్నాయ‌న్న నివేదిక తాజాగా అందింది. బ‌న్ని-త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ అల వైకుంఠ‌పుర‌ములో చిత్రానికి.. మ‌హేష్- అనీల్ రావిపూడి కాంబినేష‌న్ `స‌రిలేరు నీకెవ్వ‌రు` చిత్రానికి భారీగా పారితోషికాలు అందుకోవ‌డం ఇటీవ‌ల చర్చ‌కు వ‌చ్చింది. మ‌హేష్ విష‌యంలో  పారితోషికం ప్ల‌స్ లాభాల్లో వాటాలు ఏరియా హ‌క్కులు అంటూ లెక్క‌లు చెబుతోంటే.. 100శాతం స‌క్సెస్ రేటు ఉన్న‌ ట్యాలెంటెడ్ అనీల్ రావిపూడికి దాదాపు 10-12 కోట్ల మేర చెల్లిస్తున్నార‌న్న ప్ర‌చారం  ఉంది. దీంతో బ‌డ్జెట్లో మూడో వంతు సుమారుగా ఆ ఇద్ద‌రి ఖాతాలోకే ప‌డిపోతుంద‌ని విశ్లేషిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. అల వైకుంఠ‌పుర‌ములో చిత్రానికి హీరో-ద‌ర్శ‌కుల‌కు భారీగానే ప్యాకేజ్ ముడుతోంద‌ట‌. బ‌న్నికి రూ.20 నుంచి 25 కోట్ల మేర పారితోషికం అందుతుండ‌గా.. త్రివిక్ర‌మ్ కి న‌రూ.20 కోట్ల వ‌ర‌కూ చెల్లించ‌నున్నార‌ని తెలుస్తోంది. దాదాపు 120 కోట్ల బ‌డ్జెట్ తో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో మూడో వంతు అంటే సుమారు 45-50 కోట్లు ఆ ఇద్ద‌రి పారితోషికాల‌కే వెళ్లిపోతోంద‌ని చెబుతున్నారు. ఇక మిగిలిన‌ది ఇత‌ర బ‌డ్జెట్ కింద లెక్క‌. ఇటీవ‌ల నాన్ థియేట్రిక‌ల్ హ‌క్కులు మాకే ఇచ్చేయండి అంటూ హీరోలు గుంజేస్తున్నార‌న్న ప్ర‌చారం కొత్త‌గా వేడెక్కిస్తున్న నేప‌థ్యంలో ఈ పారితోషికాల క‌హానీ ఏంటో మింగుడు ప‌డ‌డం లేదు. అల వైకుంట‌పుర‌ములో చిత్రానికి హిందీ డ‌బ్బింగ్ రైట్స్ రూపంలో 19.5కోట్లు ద‌క్క‌గా.. స‌రిలేరు చిత్రానికి సుమారు 15కోట్ల మేర ప‌లికింద‌ని ఇప్ప‌టికే వార్త‌లు వ‌చ్చాయి. ఇక సంక్రాంతి బ‌రిలో క్రేజీగా దిగుతున్న ఈ రెండు చిత్రాల‌కు భారీగా ప్రీరిలీజ్ బిజినెస్ సాగుతోంది.

Tags:    
  • Anil Ravipudi 
  • Mahesh babu 
  • Trivikram 
  • Allu Arjun 
  • Telugu Film Industry 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS