• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  హీరోయిన్ ఆండ్రియా నోట...

హీరోయిన్ ఆండ్రియా నోట సంచలన వ్యాఖ్యలు

By - Tupaki Desk
Update: 2017-11-05 13:50 GMT
ఈమధ్య కాలంలో సినీ నటులు సెన్సేషనల్ కామెంట్లు చేయడంలో ఏమాత్రం వెనుకాడడం లేదు. బాలీవుడ్ లో కంగనా రనౌత్ నుంచి టాలీవుడ్ లో పలువురు హీరోయిన్ల వరకు అంతా ఓపెన్ గా మాట్లాడుతున్నారు. తాజాగా హీరోయిన్ ఆండ్రియా కూడా అదే తరహాలో సెన్సేషనల్ కామెంట్లు చేశారు. అమ్మాయిలు ఎవరితో పడుకుంటుందన్నది పూర్తిగా వారి వ్యక్తిగత విషయం అని, ఆ విషయంలో వారిని ఎవరూ బలవంతం చేయరాదని అన్నారు. కొద్దికాలంగా పాపులర్ అయిన మీటూ హ్యాష్ ట్యాగ్‌పై స్పందిస్తూ ఆమె ఈ మాటలన్నారు. తనకు కెరీర్ లో ఎక్కడా లైంగికంగా వేధింపులు ఎదురుకాలేదన్నారు. అలాంటి సమస్యలుంటే ఆ సినిమాను వదులుకుంటానని చెప్పారు.

విశాల్ హీరోగా నటించిన ‘డిటెక్టివ్’ చిత్రంలో నటించిన ఆమె సినిమా గురించి కూడా ముచ్చట్లు చెప్పారు. డిటెక్టివ్‌ ఒక థ్రిల్లింగ్ మూవీ అని ఆమె చెప్పుకొచ్చారు. తమిళంలో మంచి విజయాన్ని సాధించిన ఈ సినిమా తెలుగులో ఈ నెల 10న విడుదల కానుంది. ఇందులో ఆండ్రియా గ్రే షేడ్స్‌ ఉన్న పాత్ర చేసింది. ఆ పాత్ర కోసం ఆమె కొన్ని యాక్షన్‌ సీన్లు కూడా చాలా కష్టపడి చేసిందట. సినిమా కోసం హార్లీ డేవిడ్‌ సన్‌ బైక్‌ను నడపడం కూడా నేర్చుకుందట.

తనను  ఎగ్జయిట్‌ చేసే అంశాలు ఉన్నప్పుడే ఆ సినిమాలు చేస్తానని.. ఎలాంటి ఎగ్జయిట్మెంట్ లేకపోతే సినిమాలు చేయనని చెప్పారు. ప్రస్తుతం తెలుగులో మూడు సినిమాలు తనవి విడుదల కానున్నాయని చెప్పారు. అవకాశమొస్తే స్ట్రెయిట్ తెలుగు సినిమాలు కూడా చేస్తానని చెప్పారు.
Tags:    
  • Andrea 
  • Sensational Comments 
  • Actress Andrea 
  • Telugu News 

Similar News

విజయేంద్ర ప్రసాద్.. ఏం చేస్తున్నారు?

2026-11-04 01:30 GMT

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

డిసెంబర్‌లో తెలుగు సినిమాలకు హాలీవుడ్ టెన్షన్!

2026-11-03 23:30 GMT

హాలీవుడ్‌లో ఆర్నాల్డ్- కోలీవుడ్‌లో మ్యాడీ ఇద్ద‌రిదీ ఒకటే బాట‌!

2026-11-03 22:30 GMT

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

ఆ అలవాటే 50 ఏళ్లలో కూడా వచ్చింది..జయసుధ కామెంట్స్ వైరల్

2026-11-03 18:30 GMT

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

2026-11-03 18:23 GMT

Bigg Boss Telugu 10: ముకేశ్ హీరో అవుతాడా, లేక జీరో అవుతాడా?

2026-11-03 18:23 GMT

వారణాసి: RRR కంటే 40 రోజులు తక్కువ!

2026-11-03 18:18 GMT

పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్‌కు.. అన్ని భాషల స్టార్ట్స్ తో కలిసి రాజమౌళి సినిమా!

2026-11-03 18:16 GMT

రామాయ‌ణ (X) కింగ్: ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఎవ‌రు ది బెస్ట్?

2026-11-03 18:10 GMT

న్యూజిలాండ్లో వెకేషన్ మోడ్‌లో నవదీప్‌ గ్యాంగ్ సందడి!

2026-11-03 18:09 GMT

Copyright @2026

Powered by Blink CMS