• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  శ్రీముఖి లైఫ్ లో హీరో కమ్...

శ్రీముఖి లైఫ్ లో హీరో కమ్ విలన్ అతడేనా?

By - Tupaki Desk
Update: 2019-10-25 03:40 GMT
ఎంత బిగ్ బాస్ షో అయితే.. మరెంత టాస్క్ అయితే మాత్రం టాప్ సీక్రెట్ అయిన విషయాన్ని బయటకు చెప్పేసి సంచలనంగా మారారు ప్రముఖ యాంకర్ శ్రీముఖి. ఫైనల్ వీక్ లోకి బిగ్ బాస్ ఎంట్రీ ఇచ్చిన వేళ.. ముందు నుంచి ఉన్న అంచనాలకు తగ్గట్లే శ్రీముఖి ఫైనల్ పోరుకు రెఢీ అయ్యారు.

ఈ సందర్భంగా బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ను పూర్తి చేసే క్రమంలో తన రియల్ లైఫ్ కు సంబంధించిన ఒక సీక్రెట్ ను ఆమె షేర్ చేసుకున్నారు. శ్రీముఖి నోటి నుంచి వచ్చిన మాటలు ఇప్పుడు ఆసక్తికరంగానే కాదు.. హాట్ టాపిక్ కావటానికి సరిపడా కంటెంట్ ఉండటం గమనార్హం.

తన సీక్రెట్ లైఫ్ కు సంబంధించిన నిజాల్ని చెప్పాలంటూ బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ను పూర్తి చేసే క్రమంలో సంచలన నిజాల్ని బయటపెడుతూ.. గతంలో తనకో లవ్ స్టోరీ ఉందని చెప్పింది. తామిద్దరి మధ్య మంచి రిలేషన్ ఉండేదని.. అన్ని సెట్ అయిపోయాయి.. పెళ్లి మాత్రమే మిగిలిందన్న వేళ ఊహించని షాక్ తగిలినట్లు చెప్పింది. లేనిపోని మనస్పర్థల కారణంగా కెరీర్  సూపర్ సక్సెస్ తో సాగుతుంటే.. లవ్ లైఫ్ లో దారుణమైన పరిస్థితులు ఎదురైనట్లు వెల్లడించింది.

తన లైఫ్ లో ఉన్నది కూడా ఒక సెలబ్రిటీనే అంటూ బాంబు పేల్చింది. అందంగా సాగిపోతున్న తమ రిలేషన్ షిప్ లో అనుకోని డిస్ట్రబెన్సులు వచ్చాయని.. ఈ కారణంతోనే అతనితో పెళ్లి వరకూ వెళ్లిన వ్యవహారం ఉన్నట్లుండి ఆగినట్లు పేర్కొంది. దీంతో తాను చచ్చిపోదామని అనుకున్నట్లు వెల్లడించింది. ఎన్నోసార్లు తాను మేకప్ రూం పక్కకు వెళ్లి విపరీతంగా ఎడ్చినట్లుగా జరిగిపోయిన రోజుల గురించి వెల్లడించింది.

శ్రీముఖి రివీల్ చేసిన ఆమె సీక్రెట్ లైఫ్ లో ఉన్న హీరో కమ్ విలన్ ఎవరన్నది ఇప్పుడు చర్చగా మారింది. అప్పట్లో యాంకర్ రవితో శ్రీముఖి ప్రేమాయణం సాగిందన్న వార్తలు బయటకు వచ్చాయి. వీరిద్దరూ కలిసి చేసిన పటాస్ షో బ్లక్ బస్టర్ అయ్యింది. వీరిద్దరి మధ్య సమ్ థింగ్ ఉన్నట్లు పుకార్లు షికార్లు చేశాయి. కానీ.. ఆ షో నుంచి శ్రీముఖి తర్వాత బయటకు వచ్చేసింది.

మరి.. ఆమె వెల్లడించిన సీక్రెట్ లైఫ్ లో ఉన్నది యాంకర్ రవినేనా? అన్నది ఇప్పుడు డౌట్ కలుగుతోంది. మరోవైపు అప్పట్లో శ్రీముఖి ఎక్కువగా ప్రదీప్ తో కూడా యాంకరింగ్ చేసింది. ఇంతకీ వీరిద్దరిలో శ్రీముఖి చెప్పింది ఎవరి గురించన్నది ఇప్పుడు క్వశ్చన్ గా మారింది. మరోవైపు.. అసలు వీరిద్దరూ కాదు.. సీక్రెట్ లైఫ్ లో ఉన్నది మరొకరా? అన్నది ఇప్పుడు సరికొత్త చర్చగా మారిందని చెప్పక తప్పదు.

Tags:    
  • Anchor Srimukh 
  • Boyfriend 
  • Telugu News 
  • Telugu CInema News 

Similar News

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

'రాప్తాడు ఘటన'కు సినిమాలను నిందించడం సరికాదు!

2026-11-06 03:55 GMT

నేను అంత అందంగా లేను.. ఈ స్వ‌చ్ఛ‌తే సీత పాత్ర‌కు ఔచిత్యం!

2026-11-06 03:53 GMT

మేనల్లుడి ఎంగేజ్‌మెంట్‌కు పవన్ ఎందుకు రాలేదు?

2026-11-06 03:49 GMT

Bigg Boss Telugu 10: టాప్ వోటింగుతో దూసుకుపోతున్న ముఖేష్!

2026-11-06 03:47 GMT

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

తమిళ సినిమాలకు తెలుగులో తగ్గుతున్న క్రేజ్..!

2026-11-06 01:45 GMT

భార్య 10PM అల‌వాటుకు అగ్ర హీరోలో కంగారు!

2026-11-06 01:44 GMT

మరి ఇంతలా అవసరమా విజయ్, త్రిష..!

2026-11-06 01:43 GMT

Copyright @2026

Powered by Blink CMS