వాడి వీడియోపై అనసూయలో పెల్లుబుకిన ఆగ్రహం

Update: 2020-04-17 09:50 GMT
ఇన్నాళ్లు యాక్టర్లు - పొలిటీషియన్లే పాపులర్ అయ్యేవారు..కానీ టిక్ టాక్ రాకతో సామాన్యులకూ సెలెబ్రెటీ హోదా దక్కింది. సామాన్యులు సైతం తమ టాలెంట్ తో టిక్ టాక్ లో పాపులర్ అవుతున్నారు. వారిని మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. వారు చేసే చర్యలను కోట్ల మంది టిక్ టాక్ లో చూస్తున్నారు. అలాంటి వారు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే ఏమనాలి? ఇప్పుడు స్టార్ తెలుగు యాంకర్ అనసూయలోనూ అలాంటి ఆగ్రహమే పెల్లుబుకింది.

తాజాగా టిక్ టాక్ లో కరోనా వైరస్ పై బోలెడు ఫ్రాంక్ వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి.. ఆ కోవలోనే దాదాపు 11.8 మిలియన్ల ఫాలోవర్స్ అంటే కోటి 18 లక్షల మంది అభిమానులున్న ‘షాదాబ్ ఖాన్’ అనే టిక్ టాక్ యూజర్ చేసిన పనిపై అనసూయ నిప్పులు చెరిగింది.

షాదాబ్ ఖాన్ తాజాగా టిక్ టాక్ లో ఓ వీడియో చేశాడు. పార్క్ లో నడుకుంటూ వెళ్తున్న షాదాబ్ - అతడి స్నేహితుడు ఓ అమ్మాయికి డ్యాష్ ఇస్తారు. ఆమె గట్టిగా షాదాబ్ ను చెంపపై లాగి ఒక్కటి పీకుతుంది. దీనికి సీరియస్ అయిన షాదాబ్ చేతిలో ఉమ్మివేసి ఆమెకు సారీ చెప్పి షేక్ హ్యాండ్ ఇస్తాడు. కరోనా వ్యాపించేలా అతడు చేసిన వీడియో దుమారం రేపింది. విమర్శలకు తావిచ్చింది.

ఈ వీడియోను ట్విట్టర్ లో షేర్ చేసిన అనసూయ.. 11.8 మిలియన్ల మంది ఫాలో అవుతున్న ఇతడు వైరస్ ను ఎలా అంటించాలో చూపిస్తున్నాడు.. మనం కరోనాను కట్టడి చేయాలని ఇంట్లో కూర్చుంటే ఇలా వైరస్ లాంటి వ్యక్తులు వ్యాపింపచేస్తున్నారు. వీరిని ఏమనాలి? వీడి ఖాతాను వెంటనే తొలగించాలి’ అని మండిపడింది. కరోనాపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారిపై తన ఆగ్రహాన్ని వెల్లడించింది. అనసూయ ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశమైంది.


వీడియో కోసం క్లిక్ చేయండి
Tags:    

Similar News