అనసూయకు మరో రంగమ్మత్త పడ్డట్లే

Update: 2020-02-25 06:01 GMT
హాట్‌ యాంకర్‌ గా గుర్తింపు దక్కించుకున్న అనసూయ ప్రస్తుతం బుల్లి తెర మరియు వెండి తెరపై తన ప్రభంజనం చూపిస్తోంది. రంగస్థలం చిత్రంలో రంగమ్మత్త పాత్రకు గాను ఒక్కసారిగా అనసూయ వెండి తెరపై స్టార్‌ అయ్యింది. అప్పటి నుండి ఈమెకు కీలక పాత్రల్లో నటించే ఆఫర్లు వస్తున్నాయి. వస్తున్న ప్రతి ఆఫర్‌ ను ఒప్పుకోకుండా ఆచి తూచి అడుగులు వేస్తూ ఆఫర్లు చేజిక్కించుకుంటున్న అనసూయ తాజాగా నితిన్‌ హీరోగా చేస్తున్న అంధాదున్‌ రీమేక్‌ లో కీలక పాత్ర చేసేందుకు ఓకే చెప్పింది.

హిందీలో అంధాదున్‌ చిత్రంలో టబుది కీలక పాత్ర. హీరోతో ఎక్కువ కాంబో సీన్స్‌ ఉంటాయి. సినిమా కథ లో ఆ పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. ఆ పాత్ర కాస్త బోల్డ్ గా కూడా ఉంటుంది. అలాంటి పాత్రను తెలుగులో ఎవరితో చేయిస్తారా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. నిర్ణయం ఎవరిదో కాని ఆ పాత్రకు అనసూయను తీసుకోవడంను అంతా అభినందిస్తున్నారు. టబు పోషించిన ఆ పాత్రకు అనసూయ అయితేనే బాగుంటుందని.. అన్ని విధాలుగా టబును రిప్లెస్‌ చేయడం లో అనసూయ ప్రతిభ కనబర్చుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

రంగమ్మత్త పాత్రతో నటిగా గుర్తింపు దక్కించుకున్న అనసూయ మరోసారి ఈ రీమేక్‌ లో నటించడం తో మంచి పాత్ర పడటం ఖాయం అంటూ సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఈ సినిమాను నితిన్‌ హోం బ్యానర్‌ లో నిర్మిస్తున్నారు. తాజాగా షూటింగ్‌ ప్రారంభం అయ్యింది. బాలీవుడ్‌ లో సెన్షేషనల్‌ సక్సెస్‌ అవ్వడంతో పాటు అవార్డులను కూడా దక్కించుకున్న ఈ సినిమాతో నితిన్‌ ఎలాంటి ఫలితాన్ని దక్కించుకుంటాడో చూడాలి.
Tags:    

Similar News