చీరకట్టులో కవ్విస్తున్న తెలుగు భామ!!

Update: 2020-08-13 16:30 GMT
టీవీ యాంకర్లుగా కెరీర్ ప్రారంభించి.. టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమా అవకాశాలను దక్కించుకొని నటులుగాను రాణిస్తున్న వాళ్లలో జబర్దస్త్ యాంకర్‌ అనసూయ ఒకరు. పాపులర్ యాంకర్‌గా, నటిగా, స్పెషల్ సాంగ్స్ లో ఆడిపాడుతూ.. లక్షల ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది అనసూయ. ఇండస్ట్రీలో అన్నీ విధాలుగా అనసూయ అభిమానులను ఆకట్టుకుంటుంది. సోషల్ మీడియాలో మాత్రం అనసూయ ఏం చేసినా బాగానే ఉంటుంది కానీ కొన్నిసార్లు వివాదాలకు గురవుతుంది. కుర్రకారులో అనసూయకి విపరీతంగా క్రేజ్ వుంది. ఆ క్రేజ్ కారణంగానే అనసూయకు సినిమాల్లోనూ వరుస అవకాశాలు వస్తున్నాయి. అయితే ఫేవరేట్ సెలబ్రిటీల అలవాట్లు, అభిరుచులు, అభిప్రాయాలు అలాగే ఇష్టాలు తెలుసుకోవడానికి అభిమానులు ఉత్సాహాన్ని చూపుతుంటారు.

ఇప్పుడు అదేవిధంగా అనసూయ అభిమానులు కూడా ఆమె గురించి తెలుసుకోవడానికి తెగ ఆరాటపడుతుంటారు. స్టార్ హీరోయిన్ల లాగే అనసూయ అందాలు కూడా అందరిని అట్రాక్ట్ చేస్తున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో చీర కట్టుకొని ఓ ఫోటో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అనసూయ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ట్రెండి డ్రెస్సింగ్ స్టైల్స్ తో అభిమానులను ఆకర్షిస్తుంది. అయితే ఈసారి అన్నీ రంగులు పొదిగిన చీరలో వయ్యారంగా దర్శనమిచ్చింది. డిఫెరెంట్ కలర్స్ తో అనసూయ కాస్త వెరైటీగా మెరిసిపోతుంది. అయితే ప్రతిసారి స్కిన్ షో చేసే అనసూయ ఇప్పుడు అదంతా పక్కన పెట్టి సింపుల్ లుక్కులో ఆశ్చర్యం కలిగిస్తుందని అంటున్నారు నెటిజన్లు. ప్రస్తుతం ఈ తెలుగు భామ డైరెక్టర్ కృష్ణవంశీ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.
Tags:    

Similar News