• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కాస్టింగ్ కౌచ్‌ పై స్టార్...

కాస్టింగ్ కౌచ్‌ పై స్టార్ యాంకర్ కామెంట్స్...!

By - Tupaki Desk
Update: 2020-08-14 02:30 GMT
యాంకర్ అనసూయ గురించి తెలుగు ప్రేక్షకులుకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బుల్లితెరపై పలు షోలు చేస్తూ ప్రేక్షకులకు బాగా దగ్గరైన అనసూయ ప్రస్తుతం వెండితెరపై కూడా హవా చూపిస్తోంది. సుకుమార్‌ - రామ్ చరణ్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘రంగస్థలం’లో 'రంగమ్మత్త'గా అందరిని మెప్పించింది. 'క్షణం' 'కథనం' 'ఎఫ్ 2' 'సోగ్గాడే చిన్నినాయనా' 'మీకుమాత్రమే చెప్తా' చిత్రాల ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. కాగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సినీ ఇండస్ట్రీలోని 'క్యాస్టింగ్ కౌచ్' 'మీటూ'లపై స్పందించింది.

అనసూయ మాట్లాడుతూ.. ''ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నాకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాలేదు. ఇండస్ట్రీలో మీటూ కాస్టింగ్ కౌచ్ లాంటివి ఉండొచ్చు. కానీ అది అమ్మాయి మీదే డిపెండై ఉంటుంది. ఆఫర్ ఇస్తానని ఎవరైనా ఏదైనా అడిగితే.. ఈ ఆఫర్ రావాలంటే ఇతను ఇలా అడుగుతున్నాడు.. ఇది కాకపోతే మరొకటి వస్తుందని డ్రాప్ కావచ్చు. అలా డ్రాప్ కాని ఆడవాళ్ళే ఈ కాస్టింగ్ కౌచ్‌ కి బలైపోతున్నారు. మీ టాలెంట్‌ ని మీరు నమ్ముకోండి. బయట కాంపిటేషన్ లేదని చెప్పడం లేదు. నేను చేసే క్యారెక్టర్స్‌ నా కంటే బాగా చేసే మరో పది మంది ఉండొచ్చు. కానీ మిమ్మల్ని మీరు నమ్ముకోండి'' అని చెప్పుకొచ్చింది.

అంతేకాకుండా ''నేను కూడా ఫేవరిజానికి బలై చాలా ఛాన్సెస్ మిస్ అయ్యాను. కానీ ఎప్పుడూ బయటకు చెప్పి రాద్ధాంతం చేయలేదు. ఇప్పుడు మాట్లాడాల్సిన సందర్భం వచ్చింది కాబట్టి బయటపెడుతున్నా. ఓ గ్రూప్ ఫేవరిజం వల్ల రెండేళ్ల క్రితం నేను కొన్ని అవకాశాలు కోల్పోయాను. అయినా నన్ను నేను నమ్ముకొని ఈ స్థాయికి చేరుకున్నా. ఈ క్యారెక్టర్ నేను తప్ప ఇంకెవ్వరూ చేయలేరు అనేంతలా కష్టపడాలి. లైఫ్‌ లో అదే టార్గెట్ పెట్టుకుంటే కాస్టింగ్ కౌచ్‌ కాదు కదా.. కాస్టింగ్ పిల్లో కూడా నీ దగ్గరకు రాదు'' అని అనసూయ పేర్కొన్నారు.
Tags:    
  • Anasuya Bharadwaj 
  • casting couch 
  • Metoo 

Similar News

అవకాశం పోతుందనే భయంతో మౌనంగా ఉండిపోయా.. స్వరా భాస్కర్!

2026-11-15 20:07 GMT

టాయ్‌లెట్ వ‌స్తే బిస్ల‌రీ బాటిల్లోనే.. నాటి క‌ష్టాల‌పై సీనియ‌ర్ న‌టి!

2026-11-15 20:03 GMT

'వార‌ణాసి' కి అన్నీ ర‌కాలుగా క‌లిసొచ్చేనా!

2026-11-15 20:03 GMT

విశ్వంభ‌ర త్వ‌ర‌లో అప్ డేట్ ఇస్తారా?

2026-11-15 19:27 GMT

అహంకారమనే ముద్రకు ధనుష్ వినూత్న కౌంటర్!

2026-11-15 09:46 GMT

అర్థరాత్రి పూట భార్య‌కి వార్నింగ్ లు!

2026-11-15 09:45 GMT

రామాయ‌ణ‌: 10రోజుల్లో 1200 కోట్లు.. 2000 కోట్ల క్ల‌బ్ ఇంకెంత దూరం?

2026-11-15 09:42 GMT

పని పోతుందనే భయంతో వేధింపులు సైతం భరించాను!

2026-11-15 09:38 GMT

25 ఏళ్లయినా ఇంకా జీవితాన్ని అర్ధం చేసుకుంటూనే ఉన్నా!

2026-11-15 07:32 GMT

త్రివిక్రమ్ గారు మీరు అలాంటి సినిమాలే తీయండి సార్...

2026-11-15 07:32 GMT

లగ్జరీ కంటే ప్రశాంతతే ముఖ్యం..ఎందుకో చెప్పిన సీత‌మ్మ‌

2026-11-15 06:52 GMT

బాలయ్యకు డిసెంబర్ సెంటిమెంట్.. ట్రాక్ రికార్డ్ ఎలా ఉందంటే..

2026-11-15 06:31 GMT

Copyright @2026

Powered by Blink CMS