అమీ విషెస్ వాళ్లకేనా?
సంవత్సరంలో ఓ మూడు రోజుల్లో జనాలకు దేశభక్తి పొంగి పొర్లుతుంది. ఆగస్ట్ 15.. అక్టోబర్ 2లతో పాటు జనవరి 26న దేశభక్తి తెగ ప్రదర్శించేస్తూ ఉంటారు. సెలబ్రిటీలు కూడా ఈ విషయంలో కాసింత యాక్టివ్ గానే ఉంటారు. సోషల్ మీడియా ద్వారా రకరకాల ట్వీట్స్ పెట్టేసి.. విషెస్ చెబుతున్నారు.
చాలామంది సెలబ్రిటీల మాదిరిగానే అమీ జాక్సన్ కూడా రిపబ్లిక్ డే విషెస్ చెప్పింది. తన ఇల్లు కాని ఇల్లు అయిన ఇండియాకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పింది. ఓ మాంచి లొకేషన్ లో లోయకు పైభాగాన ఉన్న చెట్టు దగ్గర నుంచుని.. భారతీయ సంప్రదాయ వస్త్రధారణ అయిన చీర-జాకెట్ ధరించి.. అచ్చమైన భారతీయురాలిగా అవతారం ఎత్తేసి మరీ అమీ జాక్సన్ ఇచ్చిన పోజ్ అద్భుతంగా ఉంది. బ్రిటన్ భామ అయిన.. ఇండియన్ రిపబ్లిక్ డే నాడు అమీ జాక్సన్ రిపబ్లికన్ డే విషెస్ చెప్పడం అందరినీ ఆకట్టుకుంది.
అయితే.. ఈమె కాషాయ రంగు చీర కట్టుకుని ఈమె విషెస్ చెప్పిన తీరు చూస్తే.. ఇదేదో బీజేపీ వాళ్లకు ప్రచారం చేయడం కోసం మాదిరిగా ఉందని అంటున్నారు చూపరులు. అయితే.. బ్రిటన్ దేశపు నారి అయినా.. మన దేశంపై ప్రేమ చూపించడాన్ని కొంతమంది మాత్రం అభినందిస్తున్నారు. రెండు రకాల కామెంట్స్ వినిపిస్తున్నా.. అమీ మాత్రం వేటికీ స్పందించలేదు.