కెరియర్ ను రిస్కులో పెడుతున్న యామీ

Update: 2016-12-02 05:30 GMT
కెరియర్ ను రిస్కులో పెడుతున్న యామీ
ఒక ప్రక్కన సంచలన కమర్షియల్ డైరక్టర్ ఎస్.శంకర్ తో ఏకంగా వరుసగా రెండో సినిమా అంటే.. ఖచ్చితంగా బ్రిటీష్‌ బ్యూటి యామీ జాక్సన్ ఎంతో లక్కీ అనే చెప్పాలి. ఆల్రెడీ 'ఐ' సినిమాతో అలరించిన ఈ హాటీ.. ఇప్పుడు '2.0' సినిమాతో మన ముందుకు రానుంది. ఈ మధ్యలో పెద్ద పెద్ద బాలీవుడ్ స్టార్లతో సినిమాలు చేస్తూ.. ఇప్పుడు సల్మాన్‌ ఖాన్ తదుపరి సినిమాలో హీరోయిన్ గా అవకాశం పట్టేసిందని తెలుస్తోంది.

కరక్టుగా ఇదే సమయంలో యామీ తన కెరియర్ ను రిస్కులో పడేసుకుంటుందా అంటే.. అవుననే అనిపిస్తోంది. అబ్బే.. సల్మాన్ ఖాన్ తో ఏదో ఎఫైర్ అన్నారు.. దాని గురించి కాదండీ బాబు. 'క్వీన్' సినిమా తమిళ రీమేక్ లో తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ఫస్టాఫ్‌ లో ఒక సెక్సీ హోటల్ అటెండెట్ పాత్రలో కనిపించే లీసా హేడెన్ రోల్ కోసం ఇప్పుడు యామీ జాక్సన్ ఓకె చెప్పిందని తెలుస్తోంది. ఆల్రెడీ తమన్నా కూడా పని చేయలేని పెద్ద పెద్ద డైరక్టర్లతో సినిమాలు చేస్తున్న యామీ.. ఇప్పుడు ఇలాంటి సైడ్ క్యారెక్టర్ చేస్తే ఆమె కెరియర్ గ్రాఫ్‌ ఏమవుతుంది?

సరిగ్గా ఇదే విషయం గమనించిన ఆమె ఫ్యాన్స్.. అనవసరంగా ఈ రోల్ ఒప్పుకుంటే మాత్రం.. పెద్ద సినిమాల ఆఫర్లన్నీ హుష్‌ కాకి అంటాయని చెబుతున్నారు. మరి యామీ వింటుందా??

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News