ఫోటో స్టోరి: ఎమీ కవ్వించకలా..

లేడీ రోబోట్ గా అద్భుత విన్యాసాలతో ఆకట్టుకుంది ఎమీజాక్సన్. ఇండియాస్ క్రేజీ మూవీ 2.0 లో నటించిన లండన్ బ్యూటీగా ఎమీ పేరు వరల్డ్ వైడ్ పాపులరైంది. శంకర్ విజన్ కి తగ్గట్టు - రజనీ కి సపోర్టింగ్ పాత్రలో అద్భుతంగా నటించిందన్న ప్రశంసా అందుకుంది. అయితే ఆ సినిమా తర్వాత ఎమీ ఎందుకో వేరొక సినిమాకి సంతకం చేయలేదు. ఈ ఏడాది ఎట్టి పరిస్థితిలో తన లండన్ బోయ్ ఫ్రెండ్ .. బిలియనీర్ జార్జి పనాయట్టును పెళ్లాడేసేందుకు రెడీ అవుతోంది. అందుకు ఇంకా ఎంత సమయం పడుతుందో కానీ, ఈలోగానే ఎమీజాక్సన్ పూర్తిగా కమర్షియల్ ప్రకటనల్లో నటిస్తూ ఆర్జించడంపైనే దృష్టి సారించింది.
కోలాల నుంచి రమ్మీ ఆట వరకూ ప్రతిదీ ఎమీజాక్సన్ కు ఆదాయ మార్గమే. మార్గం ఏదైనా సంపాదన ముఖ్య ం! అన్న ఫక్తు కమర్షియల్ ఫార్ములాని ఎమీ అడాప్ట్ చేసుకుంది. వాణిజ్య ప్రకటనల ద్వారా ఈ అమ్మడు మిలియన్ ట్రిలియన్ డాలర్ ఆదాయం ఆర్జిస్తోంది. తాజాగా ఈ అమ్మడు వేరొక కొత్త బ్రాండ్ కి అంబాసిడర్ గా ఎంపికైంది. ఇప్పటికే సామాజిక మాధ్యమాల ద్వారా ఈ కొత్త ప్రొడక్ట్ కి ప్రచారం చేసింది. సౌందర్య ఉత్పత్తుల్లో కంటి కి సాంత్వన కలిగించే, కంటి కింద వలయాల్ని తొలగించే కొత్త ఉత్పత్తుల్ని ఉపయోగిస్తున్నానని ప్రచారం చేస్తోంది. అంతేకాదు ఓ ఎమీ పేరుతో ఓ కోడ్ ని ఇచ్చి ఉచితంగా వీటిని దక్కించుకోండి అంటూ ఎర వేసింది. ఈ ప్రకటనలో ఎమీ మోడ్రన్ ఎంకి లా టెంప్టింగ్ లుక్ యూత్ లోకి దూసుకెళ్లింది. మొత్తానికి ఈ ప్రచారం సదరు ఉత్పత్తికి బాగానే కలిసి రానుందని అర్థమవుతోంది.
ఇక ఇప్పటికే ఎమీజాక్సన్ ని ఏనుగుల సంరక్షణ (ఆసియా ఎలిఫేంట్ ఫ్యామిలీ సంరక్షణ) కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల అందుకు సంబంధించిన కమర్షియల్ లోనూ నటించింది. ఇక కెరీర్ గురించే సరైన క్లారిటీ లేదు. ముందు పెళ్లా? కెరీరా? అన్నదానిపై ఎమీ పూర్తి క్లారిటీతో వెళితే బావుంటుందేమో. తదుపరి సినీకెరీర్ గురించిన తెలివైన అడుగులు వేసే ఛాన్సుంటుంది. ప్రఖ్యాత డీసీ సంస్థ ఎమీజాక్సన్ ని సూపర్ హీరోయిన్ గా చూపిస్తామని ప్రకటించింది. అందుకు సంబంధించిన క్లారిటీ రావాల్సి ఉందింకా.