మ‌హా భారతంలో ఇద్ద‌రు టాలీవుడ్ సూప‌ర్ స్టార్లు!

బాలీవుడ్ లో `మ‌భాభారతం` ప‌నులు మొద‌లైన సంగ‌తి తెలిసిదే. ఇందులో అమీర్ ఖాన్ శ్రీకృష్ణుడి పాత్ర పోషిస్తున్నారు.;

Update: 2025-05-29 10:30 GMT

బాలీవుడ్ లో `మ‌భాభారతం` ప‌నులు మొద‌లైన సంగ‌తి తెలిసిదే. ఇందులో అమీర్ ఖాన్ శ్రీకృష్ణుడి పాత్ర పోషిస్తున్నారు. స్క్రిప్ట్ ప‌నులు వేగంగా జ‌రుగుతున్నాయి. అయితే ఈ సినిమాకు రైటింగ్ ఎవ‌రు? దర్శ‌క త్వం ఎవ‌రు హిస్తున్నారు? వంటి విష‌యాలు అమీర్ ఖాన్ ర‌హస్యంగా ఉంచుతున్నారు. మ‌హా భార‌తం అంటే చాలా పాత్ర‌ల‌తో ముడిప‌డిన క‌థ‌. దీంతో ఎంత మంది న‌టులు రంగంలోకి దిగుతున్నారు? అన్న‌ది అంతే స‌స్పెన్స్ గా మారింది.

ఈ నేప‌థ్యంలో టాలీవుడ్ నుంచి ఇద్ద‌రు సూప‌ర్ స్టార్లు మాత్రం మ‌హాభార‌తంలో భాగ‌మ‌వుతున్న‌ట్లు లీకైంది. దీంతో ఇప్పుడా స్టార్ హీరోలిద్ద‌రు ఎవ‌రు అన్న‌ది స‌స్పెన్స్ గా మారింది. అమీర్ ఖాన్ త‌ల‌పెట్టిన ప్రాజెక్ట్ కాబ‌ట్టి ఇది అతి పెద్ద ప్రాజెక్ట్. ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ చిత్రాన్ని ఆయ‌న భావిస్తున్నారు. క‌థ‌కు త‌గ్గ న‌టుల్నే రంగంలోకి దించుతారు. ఈ నేప‌థ్యంలో టాలీవుడ్ న‌టుల‌కు ఆయ‌న పెద్ద పీట వేస్తున్నారు? అన్న సంగ‌తి అర్ద‌మ‌వుతుంది.

ఇంకా వివిధ ప‌రిశ్ర‌మ‌ల నుంచి చాలా మంది స్టార్లు భాగ‌మ‌య్యే అవ‌కాశం ఉంటుంది. మ‌హాభారతాన్ని ఒక్క భాగంలో చెప్పేది కాదు. ఎన్ని భాగాలైనా చేసే అవ‌కాశం ఉన్న క‌థ అది. అందుకు అమీర్ ఖాన్ చాలా స‌మ‌యం తీసుకుంటారు. ఓ వైపు క‌మ‌ర్శియ‌ల్ సినిమాలు చేస్తూనే మ‌ధ్య లో మ‌హాభార‌తంను ట‌చ్ చేస్తుంటారు. ప్ర‌స్తుతం ఆయ‌న క‌మిట్ అయిన సినిమాలు రెండు..మూడు ఉన్నాయి.

వాటిని పూర్తి చేసిన త‌ర్వాత పూర్తి స్థాయిలో మ‌హాభారతంకు స‌మ‌యం కేటాయించే అవ‌కాశం ఉంటుంది. మ‌హాభార‌తాన్ని ద‌ర్శ‌క‌శిఖ‌రం రాజ‌మౌళి కూడా తెర‌కెక్కించాల‌నుకుంటోన్న సంగ‌తి తెలిసిందే. ఆయ‌న డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. కానీ అమీర్ ఖాన్ ఆయ‌న‌కంటే ముందుగానే సీన్ లోకి వ‌చ్చేసారు.

Tags:    

Similar News