ఆ క్షణం.. ఆ ఫోన్ కాల్ అందుకోకపోతే..
16 ప్రాయం.. 17 ప్రాయం.. ఈ రెండిటికీ మధ్య కేవలం ఒక్క ఏడాది గ్యాప్. అది చాలు స్టార్‌గా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి. సరిగ్గా అదే చేసింది బ్రిటీష్ బ్యూటీ ఎమీ జాక్సన్. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి.. ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో అన్న చంద్రబోస్ లిరిక్ లాగా.. ఈ అమ్మడు లండన్ లో పుట్టి చెన్నయ్ లో వాలి... ఏకంగా కోలీవుడ్ ని ఏల్తోంది. సౌత్ ఇండస్ర్టీలో ప్రామిస్సింగ్ హీరోయిన్ గా ఎదిగింది. దీని వెనుక ఒక స్టోరీ ఉంది.
ఓ వేకువఝామున లండన్ లివర్ పూల్ ఏరియాలో ఆ ఇంట్లో ఓ ఫోన్ గిర్ గిర్ గిర్ మంటూ రింగవుతోంది. ఓ పెద్దయన ఫోన్ లిఫ్ట్ చేశాడు. అసలు ఆ క్షణం.. అతడు ఆ ఫోన్ కాల్ అందుకోకపోయి ఉంటే ఏమయ్యేదో ఎమీ జీవితం? ఆ రోజు ఆ క్షణం తన జీవితం మారిపోతుందని ఆ అమ్మడికే తెలియదు. కానీ అదృష్టం వెతుక్కుంటూ వచ్చి ఇంటి తలుపు తట్టింది. ఆరోజు ఆ ఫోన్ కాల్ లిఫ్ట్ చేసింది ఎమీ తండ్రి. వెంటనే డెసిషన్ తీసుకుని చెన్నయ్ లో వాలిపోయింది. మదరాసి పట్టణం సినిమాలో నటిస్తానని దర్శకుడు ఏ.ఎల్.విజయ్ తో ఒప్పందం కుదుర్చుకుంది. తొలిసినిమా పెద్ద హిట్టు కాకపోయినా.. అమ్మడుకి పేరొచ్చేసింది. ఇంకేం ఉంది అక్కడి నుంచి స్టార హీరోలంతా క్యూ కట్టారు. స్టార్ డైరెక్టర్లంతా వలలు వేశారు. చివరికి సౌత్ సూపర్ స్టార్ డైరెక్టర్ శంకర్ సైతం ఈ అమ్మడినే వలచాడు. ఐ సినిమాలో అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు కోలీవుడ్ లోనే నెం.1 హీరోయిన్ ఎమీ.
ఊరూ పేరు తో పనిలేదు. జాతి వర్ణంతో పని లేదు. ఎమీ ఇప్పుడు లోకల్ గాళ్. ట్యాలెంటుకు పట్టం కట్టారు తంబీలు. మధ్యలో తెలుగులో చరణ్ తో ఎవడు సినిమా చేసింది. ఇప్పుడు బాలీవుడ్ లో కూడా పాగా వేస్తోంది. త్వరలోనే హీరో విజయ్ - ధనుష్ - ఉదయనిధి స్టాలిన్ సరసన కనిపించనుంది. రోబో 2 లో రజనీకాంత్ సరసన కూడా ఈమెనే హీరోయిన్ గా తీసుకునేలా ఉన్నారు. దటీజ్ ఎమీ.