వర్మ ‘మర్డర్’ను ఆపండి: అమృత
దర్శకుడు రాంగోపాల్ వర్మ సమర్పణలో తెరకెక్కుతున్న ‘మర్డర్’ చిత్రాన్ని అడ్డుకోవాలని అమృతా ప్రణయ్ కోర్టును ఆశ్రయించింది. తన కథతోనే ఈ చిత్రం తెరకెక్కుతోందని, అందువల్ల ఈ సినిమా రిలీజ్ కు పర్మిషన్ ఇవ్వొద్దని అభ్యర్థించింది. ఇందుకోసం అమృత ప్రణయ్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే.. ఈ పిటిషన్ ను విచారించేందుకు హైకోర్టు నిరాకరించింది.
అది నా కథే..
‘మర్డర్’ సినిమాను తన కథతోనే తీస్తున్నారని అమృత ప్రణయ్ పిటిషన్‌లో పేర్కొన్నారు. తమ అనుమతి లేకుండా తీసిన ఈ సినిమాను అడ్డుకోవాలని, విడుదల చేయకుండా ఆదేశాలివ్వాలని కోర్టును కోరింది అమృత. మరోవైపు.. 'మర్డర్' సినిమా ప్రివ్యూను బుధవారం(డిసెంబర్ 23) ప్రదర్శించారు. గురువారం ఈ సినిమా థియేటర్లలో విడుదల కాబోతుంది.
ఎవరికీ సంబంధం లేదు..
అయితే.. చిత్ర యూనిట్ మాత్రం ఈ కథకు ఎవరితో సంబంధం లేదంటోంది. తాజాగా ప్రివ్యూ సందర్భంగా దర్శకుడు ఆనంద్ చంద్ర ఇదే విషయాన్ని స్పష్టం చేశాడు. ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ సమర్పకుడిగా, నట్టి కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆనంద్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. కాగా.. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాల తర్వాత, ఈ సినిమా మిర్యాలగూడకు చెందిన అమృత-ప్రణయ్ కథే అన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ‘మర్డర్’ సినిమాను నిలిపివేయాలంటూ గతంలో నల్గొండ కోర్టులో అమృత పిటిషన్ దాఖలు చేయడంతో సినిమాకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఎట్టకేలకు కోర్టు వివాదాలను దాటుకుని మర్డర్ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
దేశవ్యాప్త సంచలనం..
2018లో మిర్యాలగూడలో ప్రణయ్ హత్యోదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దళిత సామాజికవర్గానికి చెందిన ప్రణయ్.. వైశ్య సామాజిక వర్గానికి చెందిన అమృతను వివాహం చేసుకున్నందుకు ఆమె తండ్రి మారుతీరావు కిరాయి మనుషులతో ప్రణయ్‌ని హత్య చేయించాడని అభియోగం నమోదైన విషయం తెలిసిందే. ఆ హత్య కేసు విచారణ కొనసాగుతుండగానే మారుతీరావు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే.. రాంగోపాల్ వర్మ తీసిన ‘మర్డర్’ సినిమా.. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తమకు మానసిక ప్రశాంతత లేకుండా చేస్తోందని అమృత ప్రణయ్ వాపోతున్నారు.