టాలీవుడ్‌ పిలుపు కోసం వెయిట్‌ చేస్తున్నా

Update: 2020-12-09 07:30 GMT
తెలుగులో హిట్‌ అయిన సినిమా చూపిస్తా మావను హిందీలో 'బ్యాడ్‌ బాయ్‌' పేరుతో రీమేక్‌ చేస్తున్నారు. దీంతో పాటు అల్లు అర్జున్‌ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వచ్చి సూపర్‌ హిట్‌ జులాయి సినిమాను సైతం హిందీలో రీమేక్‌ చేస్తున్నారు. ఈ రెండు సినిమాల్లో కూడా హీరోయిన్‌ గా అమ్రిన్‌ ఖురేషి నటిస్తున్నారు. ఇంకా పలు ఆఫర్లు ఈమె తలుపు తడుతున్నాయి. ప్రస్తుతం బాలీవుడ్‌ లో మంచి ఫేమ్‌ ఉన్న హీరోయిన్‌ గా పేరున్న అమ్రిన్‌ హైదరాబాద్‌ అమ్మాయి అనే విషయం తెలిసిందే. తాజాగా హైదరాబాద్‌ కు వచ్చిన అమ్రిన్‌ పలు విషయాల గురించి మీడియాతో ముచ్చటించింది.

హైదరాబాద్‌ లో పుట్టి పెరిగిన నేను ముంబయి యాక్టింగ్‌ స్కూల్‌ లో ట్రైనింగ్‌ అయ్యాను. ఇప్పుడు హిందీలో రెండు సినిమాలు చేయడంతో పాటు మరి కొన్ని చర్చల దశలో ఉన్నాయి. సినిమా చూపిస్తా మావ రీమేక్‌ బ్యాడ్‌ బాయ్‌ సినిమాలోని ఒక పాట షూటింగ్‌ కోసం నేను హైదరాబాద్‌ కు వచ్చాను. నమషి చక్రవర్తి హీరోగా నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాదిలో విడుదల అవుతుందని పేర్కొంది. జులాయి రీమేక్‌ కూడా త్వరలో ప్రారంభం కాబోతున్నట్లుగా పేర్కొంది. కేవలం హిందీలోనే నటించాలనేది తన ఉద్దేశ్యం కాదంది.

మంచి నటనతో అన్ని భాషల్లో కూడా నటించాలని తాను కోరుకుంటున్నాను. చిన్నప్పటి నుండి తెలుగు సినిమాలు చూసి పెరిగాను. అలాంటి తెలుగు సినిమాల్లో నటించడం కోసం వెయిట్‌ చేస్తున్నాను. టాలీవుడ్‌ మేకర్స్ నుండి పిలుపు కోసం నేను వెయిట్‌ చేస్తున్నాను అంటూ అమ్రిన్‌ పేర్కొంది. హిందీలో సక్సెస్‌ అయితే ఈమె కోరుకున్నట్లుగా తెలుగులో ఆఫర్లు వచ్చేనా చూడాలి.
Tags:    

Similar News