• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బట్టర్ ఫ్లై కోసం...

బట్టర్ ఫ్లై కోసం మెగాస్టార్ గొంతు

By - Tupaki Desk
Update: 2019-03-18 09:01 GMT
నాలుగు దశాబ్దాలుగా భారతీయ సినిమాలో ఒక భాగంగా మారి తనకంటూ ప్రత్యేక చరిత్ర సృష్టించుకున్న బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ మంచి గాయకుడన్న సంగతి తెలిసిందే. వీలు దొరికినప్పుడు తన స్వరం సూటయ్యే పాటలు ఆయనే స్వయంగా పాడుకోవడం హిందిలో చాలా సార్లు జరిగింది. ఈసారి తన గాత్రాన్ని ఆయన సౌత్ సినిమా కోసం ఇవ్వబోతున్నారు.

కన్నడలో రమేష్ అరవింద్ దర్శకత్వంలో రూపొందుతున్న బటర్ ఫ్లైలో అమితాబ్ ఓ క్లబ్ సాంగ్ పాడబోతున్నారు. ఇది కంగనా రౌనత్ క్వీన్ కు రీమేక్. అక్కడ పరుల్ యాదవ్ టైటిల్ రోల్ పోషిస్తుండగా తెలుగులో తమన్నా చేస్తోంది. దటీజ్ మహాలక్ష్మి పేరుతో విడుదలకు రెడీగా ఉంది. తమిళ్ లో కాజల్ అగర్వాల్ తో పారిస్ పారిస్ గా మలయాళంలో మంజిమా మోహన్ తో జామ్ జామ్ గా ఒకేసారి తెరకెక్కించారు. అయితే దర్శకులు వేర్వేరు

ఈ కారణంగానే అమితాబ్ గొంతు మనకు కన్నడ వెర్షన్ లో మాత్రమే వినిపిస్తుంది. ఇటీవలే సైరాలో తన షూటింగ్ పూర్తి చేసుకున్న అమితాబ్ ఈ మధ్య సౌత్ సినిమాల మీద ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడీ పాటలో అమితాబ్ తో పాటు యుట్యూబ్ సెన్సేషన్ విద్యా వోక్స్ జత కలిసినట్టు తెలిసింది. దీన్నే పారిస్ లో ఓ నైట్ క్లబ్ ని నాలుగు రోజుల పాటు అద్దెకు తీసుకుని గణేష్ ఆచార్య నృత్య దర్శకత్వంలో చిత్రీకరించారు. తెలుగు వెర్షన్ లో ఈ పాట ఎలా ఉండబోతోంతో ఎవరితో పాడించారో ఇంకా తెలియాల్సి ఉంది. సరైన విడుదల తేదీ కోసం క్వీన్ నాలుగు బాషల రీమేక్ వెర్షన్లు ఎదురు చూస్తున్నాయి.
    

Tags:    
  • Amitabh Bachchan 
  • Butterfly Movie 
  • Telugu News 
  • Queen remake 
  • Latest Updates 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS