విలన్ ని చూసి నవ్విన సమంతా!

Update: 2018-09-19 17:30 GMT
బిగ్ బాస్ షో సక్సెస్ ఎంత శాతం అనేది పక్కన పెడితే అందులో పార్టిసిపెంట్స్ పాపులారిటీ మాత్రం ఓ రేంజ్ లో పెరిగిపోతోంది. ఇంతకు ముందు పరిచయం ఉన్న వాళ్లే అయినప్పటికీ ఇందులో నుంచి బయటికి వచ్చాక ప్రేక్షకులు వీళ్ళను ఒక ప్రత్యేకమైన దృష్టితో చూస్తున్నారు. దానికి తోడు టీవీ ఛానల్స్ క్యూ కట్టి మరీ ఇంటర్వ్యూలు తీసుకోవడం తమ అనుభవాలను ఆసక్తికరంగా చెప్పడంలో సక్సెస్ కావడం లాంటి కారణాలన్నీ కూడా పేరు రావడానికి దోహదం చేస్తున్నాయి. ఇటీవలే హౌస్ నుంచి బయటికి వచ్చిన అమిత్ తివారి కూడా ఇప్పుడు ఈ ఆనందాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. తనకు షో నుంచి బయటికి వచ్చాక లేడీ ఫాలోయింగ్ పెరిగిపోయిందని ఈ రెండు రోజుల్లో కెరీర్ మొత్తంలో ఇచ్చినన్ని సెల్ఫీలు ఇచ్చానని చెప్పడం విశేషం. అంతేకాదు సినిమాల్లో పచ్చి విలన్ గా చూసిన తాను నిజ జీవితంలో ఎలా ఉంటానో పబ్లిక్ తెలుసుకునే అవకాశం బిగ్ బాస్ ఇచ్చిందని ఆనందం వ్యక్తం చేసాడు. ఈ క్రమంలోనే తన గత సినిమాలకు సంబందించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు పంచుకున్నాడు అమిత్

సన్ అఫ్ సత్యమూర్తిలో అమిత్ సమంతా జుట్టు పట్టుకుని లాగే సీన్ ఒకటి ఉంది. కానీ చూస్తూ చూస్తూ సామ్ జుట్టుని పట్టుకోవాలి అంటే అమిత్ కు టెన్షన్ వచ్చేసింది. దీంతో తన దగ్గరకు వెళ్లి జస్ట్ మీ జుత్తును లైట్ గా పట్టుకుంటాను మీరే కింద పడిపోండి అని చెప్పాడు. దీంతో నవ్వుకున్న సామ్ అలా ఏం వద్దు దర్శకుడు ఎలా చెబితే అలా చేయమని చెప్పడంతో ఏదోలా దాన్ని పూర్తి చేసాడు. షూటింగ్ అయ్యాక అమిత్ దగ్గరకు వచ్చిన సామ్ ఇంత పెద్ద జుట్టు గెడ్డం మీసాలు పెట్టుకుని ఇలా భయపడితే ఎలా అని నవ్వింది. ఇదంతా అమిత్  స్వయంగా షేర్ చేసుకున్నాడు. బిగ్ బాస్ వల్ల ఇకపై అవకాశాల గురించి చాలా ధీమాగా ఉన్నాడు అమిత్. స్టార్ హీరోల సినిమాలో చాలా వేషాలు వేసినప్పటికీ  మెయిన్ విలన్ గా పెద్ద బ్రేక్ కోసం ఎదురు చూస్తున్నాడు అమిత్. బిగ్ బాస్ పుణ్యమా అని ఎవరో ఒకరు హీరోగా చేసినా ఆశ్చర్యం లేదు.
Tags:    

Similar News