ఇలాంటి రోల్స్ అవసరమా అమల??

Update: 2017-02-28 06:27 GMT
అమల పాల్. యాక్టింగ్ టాలెంట్ బీభత్సంగా ఉంది. అయినప్పటికీ తెలుగులో గ్లామరసం చిందించడానికి ఒప్పుకుంది. బాగానే సక్సెస్ అయ్యింది. కాకపోతే ఇంతలో పెళ్ళి అడ్డురావడంతో ఆగిపోయింది. క్యారెక్టర్ బాగుంటేనే చేస్తాను అని రూల్స్ పెట్టడంతో ఇక అమ్మడికి ఇక్కడ సినిమాలను ఆఫర్ చేసేవారు కరువయ్యారు. అంతలోనే పెళ్ళికి విడాకులు ఇచ్చేయడంతో తిరిగి సినిమాలవైపే ఆశగా చూస్తోంది.

అలా మ్యారేజ్ బ్రేకప్ అవ్వగానే అమల ఒప్పుకున్న తొలిసినిమా.. కన్నడలో హెబ్బులి. హ్యాపెనింగ్ స్టార్ సుదీప్ పక్కనే హీరోయిన్ గా ఛాన్స్ అనగానే ఎగిరి గంతేసి ఒప్పేసుకుంది. కాకపోతే సినిమాలో ఆమె పేరుకు ఒక డాక్టర్ రోల్ చేసిందనే కాని.. అస్సలు ఏ మాత్రం మ్యాటర్ అనేదే లేదు. కేవలం పాటల్లో గ్లామర్ ఆరబోయడానికి మాత్రమే వాడుకున్నారు. పైగా ఆ పాటలను చూస్తే అమలపై జాలేస్తుంది కూడా. ఒక ప్రక్కన చలి రేంజు అదిరిపోతుంటే సుదీప్ సైతం చేతులకు గ్లవ్స్ అవీ వేసుకుంటే.. అమల మాత్రం పొట్టి బట్టల్లో చలిలోనే ఎక్స్ పోజింగ్ చేస్తూ నెట్టుకొచ్చింది. అసలు ఇలాంటి పాత్రలు నీకు అవసరమా అమల అంటూ ఇప్పుడు ఆమె అభిమానులు వాపోతున్నారు.

సర్లేండి.. తమిళంలో మాత్రం అమ్మడు ధనుష్‌ తో రెండు సినిమాలు.. అలాగే మరో రెండు సినిమాలు చేస్తోంది. మలయాళంలో కూడా ఓ రెండు సినిమాల్లో బిజీగా ఉంది. సో టాప్ ఫామ్ కు చేరుకోవడానికి ఏ ఒక్క సినిమా హిట్టయినా చాలులే.
Full View


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News