శిరీష్‌ ''మేరీ జాన్‌'' అంటున్నాడు

Update: 2015-06-11 07:24 GMT
శిరీష్‌ మేరీ జాన్‌ అంటున్నాడు
మెగా ఫ్యామిలీ హీరోలంతా ఆన్‌సెట్స్‌ బిజీ బిజీ. మెగాస్టార్‌ చిరంజీవి 150వ సినిమా కోసం రెడీ అవుతున్నారు. ఆగస్టులోనే ప్రారంభోత్సవం. పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ హీరోగా గబ్బర్‌సింగ్‌ 2 ఇటీవలే మొదలైంది. కాబట్టి పవన్‌ సీక్వెల్‌ పనిలో బిజీ. చరణ్‌ శ్రీనువైట్ల దర్శకత్వంలో నటిస్తున్నాడు. బన్ని హీరోగా బోయపాటి సినిమా ఈ శుక్రవారం (12న) ప్రారంభమవుతోంది. సాయిధరమ్‌తేజ్‌ 'సుబ్రహ్మణ్యం ఫర్‌ సేల్‌' చిత్రంలో ఆడిపాడుతున్నాడు. వరుణ్‌తేజ్‌  క్రిష్‌ దర్శకత్వంలో కంచే సినిమాతో బిజీ. ఇలా మెగా ఫ్యామిలీలోని అరడజను హీరోలు బిజీగా ఉన్నారు.

అయితే ఒక్క అల్లు శిరీష్‌ మాత్రమే ఇంకా సెట్స్‌కెళ్లలేదు. అతడు నటించే తాజా సినిమా గురించి ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ తెలుస్తూనే ఉన్నాయి. యువత, సోలో చిత్రాలతో హిట్టు కొట్టిన పరశురామ్‌ అల్లు అరవింద్‌ని, శిరీష్‌ని మెప్పించి ఓ ఛాన్స్‌ కొట్టేశాడు. ఇప్పుడు తాజా చిత్రానికి పూర్తి స్థాయిలో స్క్రిప్టు రెడీ అయ్యింది. మేరీ జాన్‌ అనే టైటిల్‌ని నిర్ణయించారని సమాచారం. మేరీ జాన్‌ అంటే నా హృదయం అని అర్థం. బన్ని సినిమాతో పాటే శిరీష్‌ సినిమా కూడా ఈ శుక్రవారమే (12న) లాంచనంగా ప్రారంభం కానుంది. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల్ని త్వరలోనే వెల్లడించనున్నారు. అదీ సంగతి.

Tags:    

Similar News