బన్నీ కొడుకు మామూలోడు కాదండోయ్...!

Update: 2020-05-14 03:45 GMT
బన్నీ కొడుకు మామూలోడు కాదండోయ్...!
అల్లు అర్జున్ - స్నేహారెడ్డి దంపతుల పిల్లలు అయాన్‌ - అర్హ ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే వీరు సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిపోయారు. ఈ స్టార్ కిడ్స్ చేసే అల్లరి అంతా ఇంతా కాదు. వీరి అల్లరికి సంబంధించిన ఫొటోలు వీడియోలను బన్నీ - స్నేహారెడ్డిలు పలు సందర్భాల్లో సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. పిల్లలు ఏమి చేసినా అది తల్లిదండ్రులకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. వాళ్ళు పుట్టిన దగ్గర నుండి ప్రతీ చిన్న విషయం వారికి మధురానుభూతిని మిగులుస్తుంది. వాళ్ళు చేసే అల్లరి కూడా పేరెంట్స్ కి ఇష్టం గానే ఉంటుంది. వాటిని చూసి మురిసిపోతూ ఉంటారు. ఇప్పుడు అల్లు అర్జున్ - స్నేహారెడ్డి కూడా ఇదే అనుభూతిని పొందుతున్నారు. ఇప్పుడు తాజాగా అల్లు అయాన్ అల్లరి చేస్తూనే అప్పుడప్పుడూ అద్భుతాలు చేయగలనని నిరూపించుకుంటున్నాడు. ఇంతకముందు లిటిల్ నింజాగా మారి జంపింగ్స్ చేసిన అయాన్.. ఈసారి మాత్రం కొత్తగా చెఫ్‌ అవతారమెత్తి సలాడ్‌ తయారు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను తల్లి స్నేహారెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్‌ లో పోస్ట్‌ చేశారు.

ఈ వీడియోలో అయాన్‌ సలాడ్‌ ఎలా తయారు చేయాలో వివరించే ప్రయత్నం చేశాడు. ఈ సలాడ్‌ మనకు చాలా విటమిన్‌ లను అందజేసి.. శరీరాన్ని బలంగా చేస్తుందని తన బుల్లి బుల్లి మాటలతో చెప్పాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. ఇందులో అయాన్‌ క్యూట్‌ నెస్‌ చూసిన వారెవరైనా మురిసి పోవాల్సిందే. ఇటీవల బన్నీ కుమార్తె అర్హ కూడా 'అలవైకుంఠపురంలో'ని బుట్టబొమ్మ సాంగ్‌ కు లిప్‌ సింక్‌ ఇచ్చిన వీడియో కూడా వైరల్‌ గా మారిన సంగతి తెలిసిందే. మొత్తానికి అల్లు వారి పిల్లలు.. అటు కూతురు అర్హ ఇటు తనయుడు అయాన్ ఇద్దరూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారని చెప్పవచ్చు.
Tags:    

Similar News