ఖైదీకి పవన్ రావట్లే.. కన్ఫాం!!

Update: 2017-01-03 09:41 GMT
మెగాస్టార్ కంబ్యాక్ మూవీ ఖైదీ నంబర్ 150 ఆడియో ఫంక్షన్ కు అన్ని ఏర్పాట్లు జరుగుతున్న సంగతి తెలిసిందే. విజయవాడ సమీపంలోని హాయ్ ల్యాండ్ లో ఈ కార్యక్రమానికి అన్ని అనుమతులు వచ్చాయంటున్నారు అల్లు అరవింద్. సమయం తక్కువగా ఉండడంతో ఏర్పాట్లను శరవేగంగా పూర్తి చేస్తున్నామన్న ఆయన.. ఈ వేడుకలో మెగా హీరోలందరూ పాల్గొంటారా లేదా అనే సందేహాలకు జవాబు చెప్పేశారు.

ఖైదీ ప్రీ రిలీజ్ వేడుకకు పవన్ కళ్యాణ్ వస్తాడనే ప్రచారం చాలా జోరుగా జరుగుతోంది. అయితే.. పవన్ ఈ వేడుకకు హాజరు కావడం లేదని.. ప్రస్తుతం తనకున్న బిజీ షెడ్యూల్ కారణంగానే ఖైదీ ఫంక్షన్ కి పవన్ రాలేకపోతున్నారని చెప్పేశారు అరవింద్. అలాగే ఈ వేడుక నిర్వహణలో ఇంత కన్ఫ్యూజన్ ఎందుకు నెలకొందనే సందేహంపై కూడా అరవింద్ కు సవాల్ ఎదురైంది. ఖైదీ విషయంలో ఎందుకు ఇంతగా హంగామా జరిగిందో.. వేదికను ఎందుకు మార్చుకోవాల్సి వచ్చిందో.. వేడుక తేదీ మార్పునకు కారణం ఏంటో.. చిరంజీవి స్వయంగా ఖైదీ నంబర్ 150 ప్రీ రిలీజ్ వేదికపై చెబుతారని అన్నారు అల్లు అరవింద్.

రాజకీయ కారణాలతోనే ఈ వేడుకను ప్రభుత్వం అడ్డుకుంటోందనే ప్రచారం అభిమానుల్లో జరుగుతుండడంతో.. ఇప్పుడు అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News