బన్నీ విశ్వరూపమే 'పుష్ప' : అల్లు అరవింద్
సుకుమార్ దర్శకత్వంలో బన్నీ హీరోగా 'పుష్ప' సినిమా రూపొందింది. విభిన్నమైన కథాకథనాలతో నిర్మితమైన ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. ఈ సినిమాలోని ప్రధాన పాత్రధారులంతా ఇంతకుముందు కనిపించిన పాత్రలకి పూర్తి భిన్నంగా ఈ సినిమాలో కనిపించనున్నారు. ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు అందుకు నిదర్శనం. బన్నీ అభిమానులంతా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాను ఈ నెల 17వ తేదీన విడుదల చేయనున్నారు.
విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో, ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిన్నరాత్రి హైదరాబాదులో నిర్వహించారు. వందలాదిమంది అభిమానులు ఈ ఈవెంట్ కి తరలివచ్చారు. ఈ వేడుకకి రాజమౌళి .. కొరటాల .. మారుతి .. వెంకీ కుడుముల .. అల్లు అరవింద్ గౌరవ అతిథులుగా హాజరయ్యారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ .. "మీ అందరి అసహనం దేనికో నాకు అర్థమైంది. రెండు నిమిషాల్లో ముగించాలనే ఉద్దేశంతోనే నేను ఒకటి రాసుకున్నాను .. అది చెప్పేస్తాను.
రెండు సంవత్సరాలకి ఒకసారి జరిగే మహా అద్భుతమే సుకుమార్. అల్లు అర్జున్ .. చాలా రోజులుగా తాను చూపించాలని తపన పడుతున్న ఒక విశ్వరూపం .. నా కలల ప్రతి రూపం. దేవిశ్రీ .. 3వ దశాబ్దంలో కూడా మన కర్ణభేరిపై కూర్చుని వాయిస్తున్న ఒక మధుర మృదంగం. రష్మిక .. గీతా ఆర్ట్స్ లో పుట్టిన ఈ చిన్న సితారా .. మేమందరం గర్వపడేంత ఎత్తుకు ఎదిగిన ధృవతార. మైత్రీ .. చాలామందికి వీరంటే ఇష్టం .. నొప్పించక తానొవ్వక .. పరిగెత్తడం చాలా కష్టం. కానీ త్వరలో వీరు ప్రధాన స్థానానికి చేరడం స్పష్టం"
ఇలా సునీల్ .. ఇంకా మిగతా వాళ్లందరి గురించి మాట్లాడదామని అంటే అంత సమయం లేదు. బన్నీ ఫ్యాన్స్ .. మెగాస్టార్ ఫ్యాన్స్ .. పవర్ స్టార్ ఫ్యాన్స్ .. సినిమాను ప్రేమించే ప్రతి ఒక్కరికీ బిగ్గెస్ట్ ఫీస్ట్. అందరూ కలిసి థియేటర్లకు వెళ్లి సినిమాలు చూసే సమయం వచ్చిందని నిరూపణ అయింది కనుక, అందరూ ఈ నెల 17వ తేదీన థియేటర్ లకు వెళ్లండి" అంటూ చెప్పుకొచ్చారు.