#IT SCAM మంచు వారి మోసంపై అల్లు వారు లీకులిస్తారా?
ప్రపంచంలోని అతిపెద్ద ఐటి స్కామ్ ఆధారంగా హాలీవుడ్ దర్శకుడు జెఫ్రీ గీ చిన్ దర్శకత్వంలో `మోసగాళ్లు` రూపొందుతోంది. మంచు విష్ణు ఈ చిత్రంలో కథానాయకుడు. అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీలో కాజల్ అగర్వాల్- నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తుండగా.. బాలీవుడ్ వెటరన్ హీరో సునీల్ శెట్టి అదిరిపోయే పాత్రలో నటిస్తున్నారని తెలిసింది. ఈ మూవీతోనే శెట్టి టాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నారు.
విష్ణు.. సునీల్ శెట్టి పాత్రల చిత్రణ అద్భుతంగా ఉంటుందన్న గుసగుసలు ఇదివరకూ వినిపించాయి. కెరీర్ లోనే ప్రయోగాత్మక కంటెంట్ ని ఎంచుకుని సాహసం చేస్తున్నారు మంచు విష్ణు. ఇక కంటెంట్ కి తగ్గట్టే ఇటీవల థీమ్ మ్యూజిక్ ఆద్యంతం రక్తి కట్టించింది. తాజా సమాచారం ప్రకారం .. మంచు `మోసగాళ్లు`లో అల్లు హీరో బన్ని పాత్ర ఉంటుందని షాకిచ్చారు మరి. ఇంతకీ బన్ని పాత్ర ఏమిటో? అంటే..
`మోసగాళ్లు` బృందం ప్రచార వైవిధ్యం కోసం ఏకంగా అల్లు అర్జున్ నే బరిలో దించుతోందట. కంటెంట్ పరంగా ప్రేక్షకుల కోసం ఏదో ఒక ప్రత్యేకత ఉండాలని భావించినట్టే.. ప్రచారంతో దూసుకెళ్లేందుకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరో విష్ణు మంచు కలిసి ముందుకు రాబోతున్నారట. అక్టోబర్ 3న.. బన్ని `మోసగాళ్లు` కుంభకోణం రేంజెంతో బహిర్గతం చేసేస్తారట. రేసుగుర్రమే బరిలో దిగితే ప్రచారం పీక్స్ కి చేరుతుందనడంలో సందేహమేం లేదు. ష్యూర్ షాట్ గా హిట్టు కొట్టాలన్న సంకల్పంతో విష్ణు చేస్తున్న ఈ ప్రయత్నానికి బన్ని పెద్ద సాయానికే ముందుకొచ్చారన్నమాట.