హిందీ ప్రేక్షకుల కోసం పుష్ప ప్రత్యేకంగా..!

Update: 2020-05-14 06:31 GMT
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పుష్ప. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు బన్నీ చేసిన సినిమాల్లో ఏది కూడా బాలీవుడ్ తెరమీద అంతగా ఆడింది లేదు. అందుకే ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా సుకుమార్ ఈ సినిమాను తీసుకుని తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన చివరి దశ స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది.

బాలీవుడ్ లో ఈ సినిమాను ఎక్కువ మందికి చేరువ అయ్యేలా చేయాలని అక్కడి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా స్క్రిప్ట్ ను రెడీ చేసినట్లుగా తెలుస్తోంది. హిందీ ప్రేక్షకులు కోరుకునే వినోదాన్ని ఎక్కువగా జొప్పించడం తో పాటు వారికి నచ్చే విధంగా పాటలను కూడా ట్యూన్స్ చేయిస్తున్నారు. ఈ సినిమా కోసం బాలీవుడ్ టెక్నీషియన్స్ మరియు నటి నటులు పని చేయబోతున్నారు.

అల వైకుంఠపురంలో సినిమా తర్వాత బన్నీ చేస్తున్న సినిమా అవ్వడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాను మైత్రి వారు నిర్మిస్తున్నారు. సుకుమార్ రంగస్థలం తర్వాత అనుకుకుండా వచ్చిన గ్యాప్ తర్వాత ఈ సినిమాను చేస్తున్నాడు. ఇక ఈ సినిమా లో బన్నీ ఎర్ర చందనం స్మగ్లర్ గా కనిపించబోతున్న విషయం తెలిసిందే. హీరోయిన్ గా రష్మీక మందన్నా నటిస్తుండగా ప్రముఖ హీరోయిన్ తో ఐటమ్ సాంగ్ ను చేయించబోతున్నారు.
Tags:    

Similar News