• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  దాసరికి పంచ్‌ వేసేసిన...

దాసరికి పంచ్‌ వేసేసిన బన్నీ!!

By - Tupaki Desk
Update: 2015-10-12 18:13 GMT
అప్పట్లో చిరంజీవి పేరు తీసుకురాకుండా.. ఇన్‌ డైరెక్టుగా ఒక పంచ్‌ వేశారు దర్శకరత్న దాసరి నారాయణరావు. ఇక ఆయనకు సేమ్‌ టు సేమ్‌ అదే పద్దతిలో కౌంటర్‌ ఇచ్చాడు స్టయిలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌. తన ఆడియో ఫంక్షన్‌ కే వచ్చి తన మెగా ఫ్యామిలీపై సెటైర్‌ వేసినందుకు.. రుద్రమదేవి వరంగల్‌ ఆడియో లాంచ్‌ లో విశ్వరూపం చూపించేశాడు బన్నీ. ఇప్పుడు మరోసారి మనోడు నోరు విప్పాడు.

నిజానికి ఎంతమంది ఎలాంటి ఓపెన్‌ లెటర్స్‌ రాసినా కూడా.. దర్శకరత్నం దాసరి సోమవారం ఉదయం బ్రూస్‌ లీ ని పోస్టు పోన్‌ చేయొచ్చుగా అంటూ కామెంట్లు చేసేవరకు పరిస్థతి ప్రశాంతంగానే ఉంది. ఇక ఎప్పుడైతే దాసరి బ్రూస్‌ లీ ని వాయిదా వేసుకోకపోతే మీకేం పోతుంది అంటూ క్వశ్చన్‌ లు అడిగారో.. అప్పుడే ఇక విషయం రాజుకుంది. రచ్చ రంభోలా అయ్యింది. ఏం రామ్‌ చరణ్‌ వెనక్కి వెళ్లడా.. ఇతరుల సినిమాలను బతకనివ్వడా అంటూ ఇంకో పది మంది పెద్దలు కోటింగ్‌ ఇవ్వడం మొదలెట్టారు. మరి ఇంత జరుగుతుంటే.. బన్నీ సైలెంటుగా ఉంటాడా?? ఉండడు. అందుకే అఫీషియల్‌ గా స్పందించేశాడు.

''ఒక వారం వెనక్కి వెళ్ళట్లేదని బ్రూస్‌ లీ నిర్మాతను ఆరోపించడం సమంజసం కాదు. వాళ్లు ఎప్పుడో అక్టోబర్‌ 16న వచ్చేస్తున్నాం అని చెప్పేశారు. అయితే రుద్రమదేవి సెప్టెంబర్‌ 4న రావల్సి ఉండగా.. చివరకు అక్టోబర్‌ 9న వచ్చింది. 16న బ్రూస్‌ లీ వస్తోందని తెలిసీ.. 9న రుద్రమదేవిని విడుదల చేశారు నిర్మాతలు. ఎందుకంటే రెండు సినిమాలు ఆడతాయి అని వారికి తెలుసు. కాని ఇప్పుడు సడన్‌ గా కొందరు బ్రూస్‌ లీ సినిమా ఓవర్‌ లాప్‌ చేస్తోందని అనడం మంచి పద్దతి కాదు'' అంటూ డైరెక్టుగానే పంచ్‌ వేశాడు బన్నీ.

మొత్తానికి సినిమాలు తీయకపోయినా కూడా దాసరి మాటలకు ఉన్న పదును.. మెగా ఫ్యామిలీ మీద ఒక్క మచ్చ కూడా పడకండూ చూసుకునే బన్నీ నైజం.. అబ్బో దేనికదే!!
Tags:    
  • Allu Arjun 
  • Bruce Lee Movie Release 
  • Controversy 
  • Dasari Narayana Rao 
  • Telugu News 
  • Ram Charan 
  • Rudramadevi Release 

Similar News

భర్తతో ప్రేమ.. ఆ తర్వాత వేరే వాళ్లతో డేటింగ్.. కాజల్ లవ్ స్టోరీ ఇదే..!

2026-11-15 03:34 GMT

జూనియ‌ర్ అతిలోక సుంద‌రి అలా ఫెయిలైంది!

2026-11-15 02:30 GMT

జోరు పెంచిన శృతిహాసన్!

2026-11-15 01:30 GMT

కంటెంట్ యుద్ధం.. ఎవరిదో విజయం?

2026-11-15 00:30 GMT

82 ఏళ్ల బామ్మతో స్టార్ హీరో కొడుకు ఎంగేజ్మెంట్.. వైరల్ వార్తలపై నిజమెంత?

2026-11-14 23:30 GMT

శ‌ర్వానంద్ భోగి నేప‌థ్య‌మిదేనా?

2026-11-14 22:30 GMT

కోట్ల ఆఫర్లయినా నో అంటున్న స్టార్ యాక్టర్!

2026-11-14 19:30 GMT

పిల్లల కలలకు రెక్కలిస్తున్న స్టార్ పేరెంట్స్!

2026-11-14 18:30 GMT

ఇఫీ-2026 వేడుకల్లో టాలీవుడ్ సౌండే లేదు!

2026-11-14 17:45 GMT

పీసీ, శృతి, జాన్వీ, శిల్ప, అనుష్క.. ఔను అయింది!

2026-11-14 17:30 GMT

పవన్‌తో మరో సినిమా.. దిల్ రాజు ప్రయత్నాలు ఫలిస్తాయా?

2026-11-14 16:30 GMT

ఏడాదిలో నాలుగు... శర్వా రికార్డ్‌ అయ్యేనా?

2026-11-14 16:27 GMT

Copyright @2026

Powered by Blink CMS