• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సుక్కు.. బన్నీ లేకుండానే!

సుక్కు.. బన్నీ లేకుండానే!

By - Tupaki Desk
Update: 2019-12-06 01:30 GMT
'రంగస్థలం’ రిలీజై ఏడాదిన్నర దాటినా సుకుమార్ తన తర్వాతి సినిమాను మొదలుపెట్టలేదింకా. సుక్కు కొత్త సినిమా ఒక థ్రిల్లర్ అని వార్తలొచ్చాయి. ఐతే సినిమాలో ఎన్ని మలుపులుంటాయో ఏమో కానీ.. ఈ చిత్రం పట్టాలెక్కడానికి ముందు మాత్రం అనేక మలుపులు చోటు చేసుకున్నాయి. మహేష్ బాబుతో అనుకున్న ఈ చిత్రంలోకి అల్లు అర్జున్ రావడం అతి పెద్ద మలుపు. బన్నీ హీరోగా ఖరారయ్యాక కూడా చాలా కాలం ఈ సినిమా పట్టాలెక్కలేదు. ఐతే గత నెలలో ఈ చిత్రానికి ముహూర్త కార్యక్రమం పూర్తి చేసి దీనిపై నెలకొన్న సందేహాలకు తెరదించారు. డిసెంబరులో షూటింగ్ అని కూడా అప్పుడే సమాచారం బయటికి వచ్చింది. ఈ విషయంలో సందేహాలేమీ పెట్టుకోవాల్సిన పని లేదన్నది తాజా కబురు.

ఈ నెల 11న కేరళలో బన్నీ-సుకుమార్ సినిమా చిత్రీకరణ ఆరంభం కాబోతోంది. కాకపోతే ఈ షెడ్యూల్లో బన్నీ పాల్గొనే అవకాశం లేదని విశ్వసనీయ సమాచారం. ‘అల వైకుంఠపురములో’కు సంబంధించి బన్నీ పని పూర్తయినప్పటికీ.. కొంత విశ్రాంతి తీసుకుని - సుక్కు సినిమా కోసం అతను లుక్ మార్చుకోవాల్సి ఉంది. ఈ లోపు సుక్కు కేరళలో ట్రయల్ షూట్ లాంటిది నిర్వహించి కొన్ని సన్నివేశాలు కూడా చిత్రీకరిస్తాడట. హీరో ప్రమేయం లేని ఒక యాక్షన్ సీక్వెన్స్‌ ను సుక్కు ఈ షెడ్యూల్ లో షూట్ చేయనున్నాడట. సుక్కు ఆస్థాన ఛాయాగ్రాహకుడు రత్నవేలు ఈ సినిమాకు పని చేయట్లేదన్నది తెలిసిన విషయమే. ‘గ్యాంగ్ లీడర్’తో టాలీవుడ్‌ కు పరిచయం అయిన పోలెండ్ సినిమాటోగ్రాఫర్ కూబా ఈ చిత్రానికి పని చేయనున్నాడు. అసిస్టెంట్ డైరెక్టర్లతో కలిసి అతను ఇప్పటికే వివిధ లొకేషన్లలో రెక్కీ నిర్వహించి వచ్చాడు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేయనుంది. రష్మిక మందన్నా కథానాయిక.
Tags:    
  • Sukumar 
  • Allu Arjun 
  • #AA20 

Similar News

డేట్ నైట్స్ సీక్రెట్స్ బయటపెట్టిన కియారా-సిద్ధార్థ్!

2026-11-11 19:30 GMT

ఇద్ద‌రు పిల్ల‌ల త‌ల్లిగా సాయిప‌ల్ల‌విపై మ‌రో ప్ర‌యోగం!

2026-11-11 18:30 GMT

టీటీడీ చైర్మ‌న్ రేసులో సినీ ప్ర‌ముఖులు.. !

2026-11-11 18:30 GMT

నువ్వు ఇండస్ట్రీని ఏలుతావు..యంగ్ హీరోపై అట్లీ మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

2026-11-11 17:30 GMT

దేవరకొండ ఫ్యామిలీ.. ఒక్క సినిమా పడితే!

2026-11-11 16:39 GMT

స్టార్ జాతకాన్ని ముందే పసిగట్టిన త్రివిక్రమ్ శిష్యుడు

2026-11-11 16:38 GMT

6 రోజుల్లో 100 కోట్ల క్ల‌బ్.. సౌత్‌లో ఈ ఒక్క‌డికే

2026-11-11 16:37 GMT

వివేక్‌ సాగర్‌కి జరిగిన నష్టం ఇతర మ్యూజిక్‌ డైరెక్టర్స్‌కి పాఠం..!

2026-11-11 16:37 GMT

అనిరుధ్ పెళ్లి సర్ ప్రైజ్.. ఇక సన్ పిక్చర్స్‌తో కొత్త ఎమోషన్

2026-11-11 16:33 GMT

కావ్య మార‌న్‌తో అనిరుధ్ పెళ్లి మొద‌టి ఫోటో

2026-11-11 14:00 GMT

డేంజర్ జోన్‌లో సీనియర్ హీరోయిన్ల‌ కెరీర్?

2026-11-11 13:30 GMT

స్టార్ డైరెక్ట‌ర్ ఇమేజ్ ని వాడుకోలేక‌పోతున్న ఫ్యామిలీ!

2026-11-11 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS