సూర్య హ్యాండ్ ఇచ్చాడుగా!!

Update: 2017-08-15 05:09 GMT
టాలీవుడ్ లో హీరోగా తనకంటూ ఓ స్థాయిని, మార్కెట్ ని ఏర్పరచుకున్న హీరో  అల్లు అర్జున్. వచ్చింది మెగా ఫ్యామిలీ నుంచి అయినా ఆ తర్వాత స్టైలిష్ స్టార్ అని తనకంటూ ఓ బ్రాండ్ ని సెట్ చేసుకున్నాడు. ముఖ్యంగా సరైనోడు హిట్ తో మొదటి సారి బాక్స్ ఆఫీస్ దగ్గర తన స్థయిని ప్రూవ్ చేశాడు. కానీ ఆ తర్వాత వచ్చిన డీజే తో అంతగా ఆకట్టుకోలేకపోయాడు.

ప్రస్తుతం వక్కంతం వంశీ దర్శకత్వంలో నా పేరు సూర్య అనే దేశ భక్తి కథతో రాబోతున్నాడు. అయితే ఇప్పటికే షూటింగ్ స్టార్ చేసి చాలా రోజులు కావొస్తున్న ఇంకా ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయలేదు. కొన్ని రోజుల క్రితం ఆగస్టు 15న రిలీజ్ చేస్తామని టాక్ వచ్చింది కానీ విడుదల చేయకపోవడంతో అల్లు ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందారని తెలుస్తోంది.అయితే భారీ అంచనాలున్న ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఉండాలని అందుకే లేట్ జరుగుతోందని టాక్.

ఇక ఈ సినిమాను లగడపాటి శ్రీధర్ నిర్మిస్తున్నాడు. చిత్ర దర్శకుడు వంశీ ఇంతకుముందు అనేక సినిమాలకు కథ రచయితగా పని చేశాడు.ఇప్పుడు నా పేరు సూర్య  ద్వారా దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన అల్లు అర్జున్   రేసుగుర్రం కథని కూడా వక్కంతం వంశీని అందించాడు. ఈ సినిమాకి బాలీవుడ్ కి చెందిన సంగీత దర్శకులు విశాల్-శేఖర్ సంగీతాన్ని అందిస్తుండగా.. స్టైలిష్ స్టార్ సరసన అను ఇమ్మాన్యూల్ నటిస్తోంది.


Tags:    

Similar News