• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అక్కడ బన్నీకి ఎంత క్రేజో...

అక్కడ బన్నీకి ఎంత క్రేజో చూశారా?

By - Tupaki Desk
Update: 2015-11-05 07:30 GMT

Full View
ఆరు దశాబ్దాలకు పైగా చరిత్ర ఉన్న టాలీవుడ్ లో ఎంతో మంది పెద్ద పెద్ద స్టార్లు వచ్చారు. వెళ్లారు. ఇప్పుడు కూడా చాలామంది స్టార్ హీరోలున్నారు. కానీ వాళ్లందర్లోకి ఒక్క అల్లు అర్జున్ మాత్రమే ఏం మాయ చేశాడో కేరళ జనాల్ని. అతనంటే అక్కడి జనాలు పడి చచ్చిపోతారు. మనకు ఊహకైనా అందని స్థాయిలో అక్కడి బన్నీకి అభిమానులున్నారు. మలయాళ స్టార్లకు ఏమాత్రం తగ్గని బన్నీకి ఉన్న ఫాలోయింగ్ చూస్తే మనోళ్లకు మతి పోవడం ఖాయం. ఆ మధ్య ‘సన్నాఫ్ సత్యమూర్తి’ ప్రమోషన్లలో భాగంగా కేరళకు వెళ్లిన బన్నీకి అభిమానులు బ్రహ్మరథం పట్టిన సంగతి గుర్తుండే ఉంటుంది.

తాజాగా బన్నీ క్రేజ్ అక్కడ ఏ స్థాయిలో ఉందో చెప్పే వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఓ డ్యాన్స్ షోలో అల్లు అర్జున్ పాటల మిక్స్ తో ఓ అమ్మాయి డ్యాన్స్ చేసిన తీరు చూస్తే బన్నీ మేనియా బాగా అర్థమవుతుంది. ఓ మలయాళ డ్యాన్స్ రియాల్టీ షోలో బన్నీ అభిమాని అతను నటించిన తెలుగు సినిమాల్లోని మాంచి డ్యాన్స్ నంబర్లతో ఇరగదీసింది. ఐతే ఏదో ఒక పాట ప్లే చేసేయకుండా ఓ టైమింగ్ ప్రకారం వాటిని మిక్స్ చేయడం.. దానికి కామెంట్రీ యాడ్ చేయడం.. ఓ ఫీలింగ్ తో డ్యాన్స్ చేయడం.. బన్నీ స్టెప్పుల్ని బాగా దించేయడం.. ఈ వ్యవహారమంతా చూసి తీరాల్సిందే. బన్నీ-స్నేహ ఫొటో చూపిస్తూ.. మై లవ్ ఈజ్ గాన్ అన్న పాటేసుకోవడం ఈ వీడియోలో అసలైన హైలైట్.
Tags:    
  • Allu Arjun 
  • Kerala 
  • Telugu News 

Similar News

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

'రాప్తాడు ఘటన'కు సినిమాలను నిందించడం సరికాదు!

2026-11-06 03:55 GMT

నేను అంత అందంగా లేను.. ఈ స్వ‌చ్ఛ‌తే సీత పాత్ర‌కు ఔచిత్యం!

2026-11-06 03:53 GMT

మేనల్లుడి ఎంగేజ్‌మెంట్‌కు పవన్ ఎందుకు రాలేదు?

2026-11-06 03:49 GMT

Bigg Boss Telugu 10: టాప్ వోటింగుతో దూసుకుపోతున్న ముఖేష్!

2026-11-06 03:47 GMT

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

Copyright @2026

Powered by Blink CMS