• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బన్నీ ఫ్లోనా సీరియస్సా?

బన్నీ ఫ్లోనా సీరియస్సా?

By - Tupaki Desk
Update: 2018-07-16 06:14 GMT
నిన్న జరిగిన విజేత సక్సెస్ మీట్ లో  వన్ అండ్ ఓన్లీ అట్రాక్షన్ గా ఉంది స్టైలిష్ స్టార్ అల్లు అర్జునే. సినిమా గురించి నిర్మాత సాయి కొర్రపాటి గురించి ప్రత్యేకంగా అభినందించిన బన్నీ ఫాదర్ సెంటిమెంట్ వల్లే తనకు విజేత బాగా నచ్చిందని చెప్పడం ఆకట్టుకుంది. ఇక తన స్పీచ్ లో భాగంగా వారాహి బ్యానర్ లో చాలా మంచి సినిమాలు వస్తాయని సరైన సబ్జెక్ట్ కనక కుదిరితే ఇందులో ఓ సినిమా చేయాలనుందని చెప్పేసాడు. నిజానికి సాయి కొర్రపాటి బాలకృష్ణ మినహా స్టార్ హీరోతో ఇంత వరకు డీల్ చేయలేదు. లెజెండ్ కూడా 14 రీల్స్ సంస్థ భాగస్వామ్యంతో నిర్మించారు. ఇప్పుడు తీస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ లో కూడా హీరోతో పాటు మరో పార్టనర్ కూడా ఉన్నాడు. ఆయన తన సింగల్ కార్డు మీద తీసినవన్నీ బడ్జెట్ లో రిస్క్ లేకుండా చిన్న తారలతో తీసినవి. కాకపోతే ఫామిలీ ఆడియన్స్ ని మెప్పించే కథలు తీస్తారని మంచి పేరైతే ఉంది.

మరి అల్లు అర్జున్ అదే పనిగా సాయి బ్యానర్ లో చేస్తానని చెప్పడం ఫ్లోనా లేక నిజంగా మనసులో మాట చెప్పాడా అని అర్థం కావడం లేదు. ఎందుకంటే ప్రమోషన్ కోసం వచ్చినప్పుడు కొన్ని హామీలు ఇవ్వడం సహజం. మొన్నోసారి తేజ్ ఐ లవ్ యు ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో చిరంజీవి నిర్మాత కెఎస్ రామారావుతో చరణ్ త్వరలోనే ఓ సినిమా చేస్తాడని ప్రకటించేసారు. ప్రాక్టికల్ గా అది జరగడానికి చాలా టైం పడుతుంది. పైగా ఇప్పుడు సాయి కొర్రపాటి అల్లు అర్జున్ తో సినిమా తీయాలన్నా కథ మొదలుకుని దర్శకుడి దాకా చాలా కసరత్తు చేయాలి. మరి బన్నీ అన్న ఆ హామీని ఉపయోగించుకునేలా సాయి కాస్త వేగంగా మూవ్ అయితే బెటర్. నా పేరు సూర్య రిజల్ట్ దెబ్బకు తన కొత్త సినిమా  ఇప్పటి దాకా మొదలుపెట్టని బన్నీ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చేయబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి కానీ అది  తానుగా బన్నీ చెప్పడం లేదు. అయినా పట్టాలు ఎక్కడం ఖాయమే. మరి వారాహి సినిమాలు ఇష్టపడే బన్నీ అందులో సినిమా చేయడానికి ఎంత టైం పడుతుందో చూడాలి. కథ తీసుకురావడమే ఆలస్యం. సాయి కొర్రపాటి త్వరపడాలి.
Tags:    
  • Allu Arjun 
  • Sai Korrapati 
  • Telugu news 

Similar News

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

రెండో పెళ్లి కూడా విఫలం..నాలుగేళ్లకే భర్తకు విడాకులు!

2026-11-04 08:02 GMT

అజిత్‌తో జతకట్టనున్న శ్రీలీల.. పూజా వేడుకలో లుక్ వైరల్!

2026-11-04 08:01 GMT

హీరోయిన్ల విషయంలో అదే వివక్ష.. కోట్లు కుమ్మరించే ధైర్యం చేయండి!

2026-11-04 08:01 GMT

ధర్మన్ శ్రీలీల.. ఈ కాంబినేషన్ వెనుక ప్లాన్ ఏంటి!

2026-11-04 07:05 GMT

Copyright @2026

Powered by Blink CMS