అత‌నే నాకు తిరుమ‌ల వెంక‌న్న‌

Update: 2021-12-23 03:30 GMT
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టించి చిత్రం `పుష్ప : ది రైజ్‌`. ప్ర‌స్తుతం ఏ నోట విన్నా ఇదే మాట `పుష్ప‌` .. పుష్ప‌... సుకుమార్ - బ‌న్నీల క‌ల‌యిక‌లో వ‌చ్చిన మూడ‌వ చిత్ర‌మిది. బ‌న్నీ కెరీర్ లోనే తొలి పాన్ ఇండ‌యా మూవీగా విడుద‌లైన ఈ చిత్రం తొలి రోజు మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకున్నా బాక్సాఫీస్ వ‌ద్ద మాత్రం రికార్డు స్థాయి ఓపెనింగ్స్ ని సాధించి ట్రేడ్ వ‌ర్గాల‌ని విస్మ‌యానికి గురిచేసింది. ఈ సినిమా వ‌సూళ్ల ప‌రంగా స‌రికొత్త రికార్డులు సృష్టిస్తూ బాక్సాఫీస్ వ‌ద్ద దూసుకుపోతోంది.

ఈ నేప‌థ్యంలో ఇటీవ‌ల తిరుప‌తిలో మేక‌ర్స్ గ్రాండ్ స‌క్సెస్ మీట్ ని నిర్వ‌హించారు. ఈ సందర్భంగా బ‌న్నీ సెంట‌ర్ ఆఫ్ ఎట్రాక్ష‌న్ గా నిలిచారు. ఈ సినిమా గురించి తాను ప‌డిన క‌ష్టం కంటే చిత్ర బృందం ఎక్కువ‌గా శ్ర‌మించార‌ని వారిపై ప్ర‌శంస‌లు కురిపించారు. అంతే కాకుండా సుకుమార్ క‌థ చెప్పిగానే త‌న పాత్ర చిత్తూరు యాస‌లో సాగుతుందని గ్రహించాన‌ని, అప్ప‌టి నుంచి చిత్తూరు ప్ర‌జ‌ల‌ని, వారి మాండ‌లికాన్ని వ్య‌వ‌హార శైలిని గ‌త రెండేళ్లుగా గ‌మ‌నించడం మొద‌లు పెట్టాన‌ని చెప్పుకొచ్చారు.

ఈ భాష‌పై ప‌ట్టు సాధించే క్ర‌మంలో ప్ర‌తీ అంశాన్ని ఎంజాయ్ చేశాన‌ని, ఈ ప్ర‌యాణం నాకు కొత్త అనుభూతినిచ్చింది. తిరుప‌తి వెంక‌న్న చిత్తూరు ప్ర‌జలు త‌మ వెన‌కుండి న‌డిపిస్తున్నాడ‌ని భావిస్తుంటార‌ని, వాళ్ల వెన‌కాల వెంక‌న్న స్వామి ఎలా వున్నాడో నా వెన‌కాల సుకుమార్ వున్నాడ‌ని, అత‌నే నాకు తిరుమ‌ల వెంక‌న్న అని చెప్ప‌డ విశేషం. ఆయ‌న గైడెన్స్ వ‌ల్లే `పుష్ప‌` లో న‌టించ‌గ‌లిగాన‌ని, `పుష్ప‌` షూటింగ్ చేస్తున్న‌ప్పుడే ఒక్క ప్రెస్ మీట్ అయినా ఇక్క‌డ పెట్టాల‌ని అనుకున్నామ‌ని ల‌క్కీగా స‌క్సెస్ మీట్ నే ఇక్క‌డ ఏర్పాటు చేయ‌డం నిజంగా నాకు ఆనందాన్ని క‌లిగించింద‌ని బ‌న్నీ చెప్పుకొచ్చాడు.

 బ‌న్నీ పుష్పరాజ్ పాత్ర కోసం పెట్టిన ఎఫ‌ర్ట్ ని టాలీవుడ్ హీరోల‌తో పాటు బాలీవుడ్ హీరోలు కూడా అభినందిస్తూ ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.
Tags:    

Similar News