బాలీవుడ్‌ బుట్టబొమ్మకు స్పందించని బన్నీ ఈ బుట్టబొమ్మ మాత్రం హార్ట్‌ టచ్చింగ్‌ అన్నాడు

Update: 2020-02-11 08:30 GMT
అల్లు అర్జున్‌ అల వైకుంఠపురంలో చిత్రంలోని పాటు ఎంతగా ఫేమస్‌ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గత మూడు నెలలుగా పాటలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా అల వైకుంఠపురంలో చిత్రంలోని పాటలు టిక్‌ టాక్‌ లో తెగ వైరల్‌ అవుతున్నాయి. లక్షలాది వీడియోలను ఈ పాటలకు టిక్‌ టాక్‌ వీడియో మేకర్స్‌ చేశారు. సెలబ్రెటీలు కూడా అల వైకుంఠపురంలో చిత్రంకు సంబంధించిన పాటలు మరియు డైలాగ్స్‌ తో వీడియోలు చేశారు.

బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ.. పొడుగు కాళ్ల సుందరి శిల్ప శెట్టి కూడా బుట్టబొమ్మ పాటకు డాన్స్‌ చేస్తూ వీడియో చేసింది. అంతటి క్రేజ్‌ ను ఈ పాట దక్కించుకుంది. బుట్ట బొమ్మ పాటకు శిల్ప శెట్టి టిక్‌ టాక్‌ వీడియోను చేయగా బన్నీ స్పందించలేదు. కాని ఇద్దరు వికలాంగులు ఈ పాటకు చేసిన టిక్‌ టాక్‌ వీడియోపై బన్నీ స్పందించాడు. ఈ వీడియో హార్ట్‌ టచ్చింగ్‌ అంటూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టాడు.

ఈ వీడియోను ట్వీట్‌ చేసిన బన్నీ బుట్ట బొమ్మకు సంబంధించిన అన్ని వీడియోల్లో నాకు ఈ వీడియో హార్ట్‌ టచ్చింగ్‌ గా అనిపించింది. సంగీతం మనిషి అంగవైకల్యంను మర్చిపోయేలా చేస్తుందని ఈ వీడియో చూస్తుంటే అనిపిస్తుందని బన్నీ సంతోషాన్ని వ్యక్తం చేశాడు. ఈ వీడియోలో కాళ్లు లేని కుర్రాడు.. చేతులు లేడీ అమ్మాయి బుట్ట బొమ్మకు డాన్స్‌ చేయడం జరిగింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.
Full ViewFull View
Tags:    

Similar News