• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బన్నీని మైమరిపించిన...

బన్నీని మైమరిపించిన ఫోటోగ్రాఫర్

By - Tupaki Desk
Update: 2018-06-05 05:18 GMT
సినిమాల్లో కలిసి పనిచేసిన టెక్నీషియన్లలో ఎవరి పనితనమైనా బాగా నచ్చితే హీరోలు మంచి కాంప్లిమెంట్ ఇస్తారు. ఓపెన్ గా ఓ రెండు మంచి మాటలు చెబుతారు. కానీ అల్లు అర్జున్ మాత్రం ఈ విషయంలో డిఫరెంట్. తన లేటెస్ట్ మూవీ నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా కోసం పనిచేసిన ఫొటోగ్రాఫర్ పనితీరు అద్భుతంగా ఉందంటూ పొగిడేశాడు. సోషల్ మీడియాలో అతడి పనితనాన్ని ప్రశంసిస్తూ ఫొటాతో సహా షేర్ చేశాడు.

బన్నీని ఇంతగా మైమరిపించిన ఆ ఫొటోగ్రాఫర్ పేరు రోహన్ శ్రేష్ట. అతడితో కలిసి పనిచేసిన అనుభవాన్ని పంచుకోవాలని ఉందంటూ అల్లు అర్జున్ ప్రత్యేకంగా ఓ పోస్టు పెట్టాడు ‘‘నా పేరు సూర్య మూవీ ఫొటో షూట్ అతడితో కలిసి పనిచేశాడు. ఈ క్రాఫ్ట్ పై అతడికున్న కమాండ్ చూసి అమేజింగ్ అనిపించింది. మెరుపు వేగం.. బెస్ట్ క్వాలిటీ రెండూ అతడిలో ఉన్నాయి. అదో రేర్ కాంబినేషన్. నేను దేశంలో చాలామంది టాప్ ఫొటోగ్రాఫర్లతో పనిచేశాను. వాళ్లలో ఈ యంగ్ జంటిల్ మేన్ బెస్ట్. ఇంతటి బ్రిలియంట్ టాలెంట్ ఉన్నవాళ్లతో పనిచేయడం ఆనందంగా ఉంది. ఫ్యూచర్ లోనూ అతడితో కలిసి పనిచేస్తాను’ అంటూ రోహన్ శ్రేష్టకు బన్నీ కితాబు ఇచ్చాడు.

ఈ పోస్ట్ తోపాటు నాపేరు సూర్య మూవీ కోసం చేసిన ఫొటో షూట్ లో ఓ బ్లాక్ అండ్ వైట్ ఫొటో షేర్ చేశాడు. ఈ లుక్ లో బన్నీ సూపర్ గా ఉన్నాడు. ఇంతవరకు బన్నీ చాలామందితో కలిసి పని చేసినా ఈ రేంజిలో పొగిడింది తక్కువ. అతడిని ఈ రేంజిలో ఇంప్రెస్ చేశాడు కాబట్టి బన్నీ తన నెక్స్ట్ సినిమాకు రోహన్ తోనే పనిచేస్తాడు. ఫిక్సయిపోవచ్చు.
Tags:    
  • allu arjun 
  • Photographer 

Similar News

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

ఈ దీపావళికి పెద్దగా సౌండ్ చేయలేకపోయిన టాలీవుడ్!

2026-11-05 07:27 GMT

కీర్తి సురేష్.. మరోసారి లెక్క తప్పిందా..

2026-11-05 07:23 GMT

సంక్రాంతి బాక్సాఫీస్ రేసు - 1000 కోట్ల బిజినెస్ అంచనా!

2026-11-05 07:21 GMT

తరుణ్ భాస్కర్.. నెక్స్ట్ ఆ హీరో దగ్గరికేనా!

2026-11-05 07:17 GMT

రహస్యం బయటపెట్టిన భాగ్యశ్రీ.. ఆ టాలెంట్ కూడా ఉందా?

2026-11-05 07:03 GMT

Copyright @2026

Powered by Blink CMS