మరి బన్నీ ఫ్యాన్స్‌ ఏం చెబుతున్నారంటే...

Update: 2015-08-29 11:49 GMT
నిజానికి మెగా 60 ఫ్యాన్స్‌ ఈవెంట్‌ లో 'పవర్‌ స్టార్‌'  అంటూ యథావిథిగా కొందరు అభిమానులు గోల చే్స్తుంటే వారికి కోటింగ్‌ ఇచ్చారు మెగా బ్రదర్‌ నాగబాబు. అయితే ఆయన కోటింగ్‌ ఇస్తున్న సమయంలో బన్నీ నవ్వాడని, ఆ నవ్వులో నాలుగు సెటైర్లు, ఆరు పంచ్‌ లు ఉన్నాయంటూ ఇప్పుడు సోషల్‌ నెట్‌ వర్క్‌ లో ఒక డిస్కషన్‌ బయలుదేరింది. అసలు అయిపోయిన ఈవెంట్‌ గురించి మెగా బ్రదర్లే మాట్టాడకుండా కామ్‌ గా పార్క్‌ హయాత్‌ లో పండగ చేసుకుంటే ఇప్పుడు కొత్తగా ఈ రచ్చేటండీ బాబూ అని అనుకునేవారూ ఉన్నారు. అలాంటి వారి కోసం బన్నీ ఫ్యాన్సు కూడా ఒక సమాధానం చెబుతున్నారు.

నిజానికి అక్కడ నాగబాబు తిట్టింది పవన్‌ కళ్యాణ్‌ ను కాదు. పవన్‌ పేరు చెప్పి ప్రతీ ఫంక్షన్‌ లోనూ రచ్చ రచ్చ చేస్తూ మెగా ఈవెంట్లను డిస్ట్రబ్‌ చేస్తున్న కొందరు ఔత్సహికుల గురించి. సో, వాళ్ళను తిడుతుంటే, కరక్టే బాబాయ్‌ అన్నట్లు బన్నీ నవ్వితే దానికి పవన్‌ ఫ్యాన్స్‌ హర్టయ్యరనడం కాస్త హాస్యాస్పదమే. ఎందుకంటే ఆ విషయం పవన్‌ అభిమానులు కూడా ఎంజాయ్‌ చేయాలి మరి. అలా ప్రతీ ఫంక్షన్‌ లో పవన్‌ అంటూ గోల చేస్తుంటే... అక్కడ మెగా ఫ్యామిలీ పరువుకంటే పవన్‌ పరువే ఎక్కువగా పోతోంది. ఏం, పవన్‌ కళ్యాణ్‌ తన అభిమానులను కంట్రోల్లో పెట్టడేంటి అంటూ చాలామంది అడుగుతున్నారు. కాబట్టి పవన్‌ బదులు వారిని నాగబాబు మందలించి మంచి పనిచేశాడని చెబుతున్నారు మెగా ఫ్యాన్సు. అది సంగతి.
Tags:    

Similar News