వీడియో: లిటిల్ బుట్ట బొమ్మ సో క్యూట్
బన్ని వారసురాలు అల్లు అర్హ అల్లరి వేషాల గురించి చెప్పాల్సిన పనే లేదు. ఇప్పటికే అర్హకు అంతర్జాలంలో వీరాభిమానులేర్పడ్డారు. క్యూట్ గడుగ్గాయ్ అల్లరి వేషాలకు వీరలెవల్లో ఫాలోయింగ్ ఉంది. డాడీ అల్లు అర్జున్.. మమ్మీ స్నేహా ఎప్పటికప్పుడు అర్హ అల్లరి వేషాల్ని సామాజిక మాధ్యమాల్లో ఫ్యాన్స్ కు షేర్ చేస్తూనే ఉన్నారు.
ఇంతకుముందు డాడీని.. తాతయ్యను ఆటపట్టించే ఫోటోలు వీడియోలు బయటికి వచ్చాయి. పెళ్లెవరిని చేసుకుంటావ్? అని ప్రశ్నించిన డాడీని ఓ రేంజులో ఆట పట్టించింది అర్హ. ఆ వీడియోని అత్యధికంగా వీక్షించారు నెటిజనులు. ఇప్పుడు మరోసారి అర్హ లేటెస్ట్ వీడియో అంతర్జాలంలో జెట్ స్పీడ్ తో దూసుకెళుతోంది. ఇంతకీ ఏమిటా వేషం అంటే..
సంక్రాంతి బ్లాక్ బస్టర్ `అల వైకుంఠపురములో` చార్ట్ బస్టర్ సాంగ్ `బుట్ట బొమ్మ`కు అదిరిపోయే ఎక్స్ ప్రెషన్స్ ఇస్తూ అల్లు అర్హ పేరడీ చేసింది. అయితే ఆ పాటను బ్యాక్ గ్రౌండ్ లో ఓ వెస్ట్రన్ బ్యూటీ పాడడం ఇంట్రెస్టింగ్. ఈ వేషాల్ని వీడియో షూట్ చేసి స్నేహారెడ్డి నేరుగా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ఆ వీడియో జెట్ స్పీడ్ తో అంతర్జాలంలోకి దూసుకెళ్లింది. ఇక బుట్ట బొమ్మ సాంగ్ ని అంతర్జాంలో ఇప్పటికే 15.5 కోట్ల (155 మిలియన్లు) మంది వీక్షించారు. ఇక అల్లు అర్జున్ తదుపరి చిత్రం కోసం సన్నాహకాల్లో ఉండగానే కరోనా లాక్ డౌన్ తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న సంగతి తెలిసిందే. ఈ తీరిక సమయాన్ని అర్హ.. అయాన్ లతోనే టైమ్ పాస్ చేస్తున్నారు అల్లు అర్జున్. అందుకు సంబంధించిన ఫోటోలు ఇంతకుముందు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.
వీడియో కోసం క్లిక్ చూడండి