బన్నీ వద్దన్నవే జరిగాయా

Update: 2019-02-27 05:49 GMT
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సెట్ లో మేకప్ వేసుకుని పది నెలలు అవుతోంది. నా పేరు సూర్య ఫలితం చూసాక తొందరపడకూడదని డిసైడ్ అయిన బన్నీ ఏకంగా ఆరు నెలలు వెయిట్ చేసి మరీ త్రివిక్రమ్ ను లాక్ చేసుకున్నాడు. అదిగో ఇదిగో అంటున్నారు కాని షూటింగ్ ఎప్పుడు మొదలుపెట్టేది మాత్రం చెప్పడం లేదు. స్క్రిప్ట్ వర్క్ ఇంకా పూర్తి కాలేదని ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కొట్టాల్సిన టార్గెట్ తో తీస్తున్న మూవీ కాబట్టి ప్రతి విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నారట.

అయితే టీంని సెట్ చేసే విషయంలో బన్నీ మీద త్రివిక్రమ్ గెలుస్తున్నాడనే టాక్ జోరుగా నడుస్తోంది. హీరొయిన్ గా ఇప్పటికే గీత ఆర్ట్స్ కు డేట్స్ ఇచ్చిన రష్మిక మందన్నను కాని మంచి ఫాంలో ఉన్న కీయరా అద్వానికి కాని తీసుకుందామని బన్నీ ఆలోచన. కాని త్రివిక్రమ్ మాత్రం అరవిందకు అదే పూజా హెగ్డే వైపు మొగ్గు చూపాడు. డిజే కాంబినేషన్ కావడంతో పెద్దగా ఇష్టం లేకపోయినా మాటల మాంత్రికుడు అల్లు అర్జున్ ని ఒప్పించాడని టాక్

మరోవైపు సంగీత దర్శకుడుగా తమన్ ని ఫిక్స్ అయ్యాడు  త్రివిక్రమ. అరవింద సమేత వీర రాఘవలో అతని సంగీతం పాత్ర చాలా ఉందని గుర్తించి మరో ఆలోచన లేకుండా తీసుకున్నాడు. అయితే బన్నీ మనసులో దేవిశ్రీ ప్రసాద్ ఉన్నాడట. అయినప్పటికీ పలు చర్చల అనంతరం ఫైనల్ టాస్ తమన్ వైపే తిరిగినట్టు సమాచారం. మొత్తానికి త్రివిక్రమ్ తన అనుభవం ఉపయోగించి బన్నీ ఛాయస్ కాకుండా తనవే గెలిచేలా చూసుకుంటున్నాడన్న మాట. ఇదంతా సరే కాని అసలు షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది విడుదల ఈ ఏడాది ప్లాన్ చేసారా లేక వేరే ఆలోచన ఏమైనా ఉందా లాంటి సందేహాలతో అభిమానులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. త్వరగా చెక్ పెట్టేస్తే బెటర్
    

Tags:    

Similar News