స్టైలిష్ స్టార్ కి పెద్ద ఫ్యాన్ అంటోంది!

Update: 2018-10-27 06:54 GMT
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఆరు నెలల గ్యాప్ తర్వాత ఎట్టకేలకు త్రివిక్రం తో హ్యాట్రిక్ మూవీ కోసం రెడీ అవుతున్నట్టు వస్తున్న వార్తలు ఖరారైనట్టే. అధికారిక ప్రకటన రావడానికి మరికొద్ది రోజులు పట్టవచ్చు కానీ ఒక్కసారి మొదలైతే మాములు కన్నా వేగంగా షూటింగ్ జరిపే ప్రణాళికలు వేస్తున్నట్టు సమాచారం. నా పేరు సూర్య తర్వాత సినిమాల్లో పెద్దగా కనిపించకపోయినా యాడ్స్ లో మాత్రం బన్నీ అలరిస్తూనే ఉన్నాడు. ఇటీవల ఓ బస్సు యాప్ ప్రమోషన్ లో పాల్గొన్న బన్నీ అందులో కో స్టార్ గా నటించిన హీరోయిన్ పరుల్ గులాటి ప్రశంశల వర్షంలో తడిసి ముద్దవుతున్నాడు. అల్లు అర్జున్ ఆలీ తో అందులో నటించిన పరుల్ ఆ మాత్రం ఎక్స్ పీరియన్స్ కే ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది.

స్టైలిష్ స్టార్ తాను అనుకున్న దాని కన్నా చాలా సింపుల్ గా ఉన్నారని సరదాగా కలిసిపోతూ చాలా మంచి వ్యక్తిగా అనిపించారని మోసేస్తోంది. అంతే కాదు దీని కన్నా ముందే బన్నీ డాన్సులకు తను అభిమానట. చూస్తుంటే అల్లు అర్జున్ కొత్త సినిమా త్వరలో మొదలుకాబోతోంది కాబట్టి ఇలా కాస్త ఫ్యాన్స్ దృష్టిలో పడి బన్నీ దాకా తన మాటలు మరోసారి రీచ్ అయితే హీరోయిన్ గానో లేక ఏదైనా కీలకమైన సపోర్టింగ్ రోల్ లో ఎంట్రీ రావచ్చని ఆశ పడుతోందేమో. మొత్తానికి పరుల్ మాటలు అభిమానులకు మాత్రం మంచి జోష్ ఇస్తున్నాయి. అంతే మరి ఇతర బాషా హీరోయిన్ పనిగట్టుకుని ఈ రేంజ్ లో తమ హీరోని పొగిడితే ఆ ఆనందం మాములుగా ఉంటుందా.
Tags:    

Similar News