అల్లు అరవింద్‌ కు దొరకని చిరంజీవి!

Update: 2018-11-13 07:15 GMT
మెగాస్టార్‌ చిరంజీవి సినీ కెరీర్‌ లో ఎన్నో సూపర్‌ హిట్‌ చిత్రాలను గీతా ఆర్ట్స్‌ లో చేసిన విషయం తెల్సిందే. అల్లు అరవింద్‌ - చిరంజీవిల కాంబినేషన్‌ అంటే అప్పట్లో చాలా నమ్మకం ఉండేది. చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లి పోయిన తర్వాత కూడా ఇద్దరి సన్నిహిత్యం కొనసాగింది. చిరంజీవికి తోడుగా రాజకీయాల్లో అల్లు అరవింద్‌ నడిచారు. రాజకీయాల నుండి చిరంజీవి మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చిన చిరంజీవితో అల్లు అరవింద్‌ సినిమాను నిర్మించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.

చిరంజీవి 150వ సినిమాను చరణ్‌ నిర్మించాలని కొణిదెల ప్రొడక్షన్స్‌ ను ప్రారంభించాడు. చిరు 150వ సినిమా సమయంలో 151వ చిత్రాన్ని బోయపాటి దర్శకత్వంలో అల్లు అరవింద్‌ గీతా ఆర్ట్స్‌ లో నిర్మించే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. చిరంజీవితో సినిమా మళ్లీ నిర్మించబోతున్నట్లుగా స్వయంగా అల్లు అరవింద్‌ కూడా ప్రకటించాడు. అయితే చిరంజీవి 151వ సినిమాను మళ్లీ చరణ్‌ నిర్మిస్తున్నాడు. భారీ చిత్రం - ప్రతిష్టాత్మక చిత్రంగా సైరాను చరణ్‌ స్వయంగా నిర్మించాలని కోరుకున్నాడు. చిరు 152వ చిత్రం అవకాశం అయినా అల్లు అరవింద్‌ కు వస్తుందని అంతా అనుకున్నారు. కాని ఆ సినిమా కూడా చరణ్‌ నిర్మించబోతున్నాడట.

చిరంజీవి 152వ చిత్రంకు కొరటాల శివ దర్శకత్వం వహించబోతున్నాడు. భారీ అంచనాల నడుమ రూపొందబోతున్న ఆ చిత్రంను చరణ్‌ నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు. చిరంజీవితో వరుసగా చిత్రాలను చరణ్‌ నిర్మిస్తున్న కారణంగా అల్లు అరవింద్‌ నిరాశగా ఇంకా చిరంజీవి డేట్ల కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. చిరంజీవి 153వ చిత్రం అయినా అల్లు అరవింద్‌ కు ఛాన్స్‌ దక్కుతుందేమో చూడాలి.

Tags:    

Similar News