రమ్యకృష్ణ నా హీరోయిన్
టాలీవుడ్ లో ప్రస్తుతం అప్పట్లో నటించిన సీనియర్ హీరోయిన్స్ సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా ప్రత్యేక పాత్రల్లో కనిపిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు ఎంతో మంది సీనియర్ హీరోయిన్స్ స్పెషల్ క్యారెక్టర్స్ చేసినా ప్రస్తుతం రమ్య కృష్ణ లాగ ఎవరు చేయలేదని చెప్పాలి. ఆమె హీరోయిన్ గా ఎంత సక్సెస్ అయ్యారో అలాగే ప్రత్యేక పాత్రలతో కూడా జనాలను చాలా వరకు ఆకట్టుకున్నారు.
ముఖ్యంగా సోగ్గాడే చిన్ని నాయన సినిమాలో రమ్య కృష్ణ చేసిన పాత్ర అందరిని ఎంతగానో ఆకట్టుకుంది. ఇకపోతే ప్రస్తుతం యువ హీరోల సినిమాల్లో తల్లిగా అత్తగా కనిపిస్తోన్న రమ్య కృష్ణ కోలీవుడ్ సినిమా గ్యాంగ్ లో ఒక స్పెషల్ క్యారెక్టర్ చేశారు. ట్రైలర్ లో రమ్య కృష్ణ చాలా వరకు ఆకట్టుకుంది. అయితే నిన్న ప్రీ రిలీజ్ వేడుకకి కూడా వచ్చి సినిమా గురించి చాలా గొప్పగా చెప్పారు. అయితే ఈ వేడుకలో నిర్మాత అల్లు అరవింద్ రమ్య కృష్ణ పై అభిమానాన్ని చాటుకున్నారు.
ఎవరు ఊహించని విధంగా రమ్య కృష్ణ నా హీరోయిన్ అని చెప్పడంతో అందరు ఒక్కసారిగా అరిచారు. స్టేజ్ పై ఉన్న సినీతారలు కూడా నవ్వేశారు. అప్పట్లో రమ్య కృష్ణ వారి ప్రొడక్షన్ లో కొన్ని సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. ఇక గ్యాంగ్ సినిమా చిత్ర యూనిట్ గురించి కూడా అల్లు అరవింద్ కొన్ని విషయాలను చెప్పి సినిమా తప్పకుండా అందరికి నచ్చుతుందని తెలిపారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కాబోతోన్న సంగతి తెలిసిందే.