సభా మర్యాద లేదు.. స్టార్ ప్రొడ్యూసర్ పై బాబు మోహన్ ఆగ్రహం!

ప్రముఖ సినీ నటుడిగా, మాజీ మంత్రిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న బాబు మోహన్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.;

Update: 2026-03-25 12:24 GMT

ప్రముఖ సినీ నటుడిగా, మాజీ మంత్రిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న బాబు మోహన్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఆహుతి, అంకుశం వంటి చిత్రాలతో ఊహించని విజయాన్ని సొంతం చేసుకున్న ఆయన.. ఈ చిత్రాల తర్వాత మళ్లీ వెనుతిరిగి చూసుకోలేదు. సినిమాలలో చేస్తున్నప్పుడే రాజకీయాలలోకి వెళ్లిన బాబు మోహన్.. అక్కడ మంత్రిగా పనిచేసి ఇప్పుడు మళ్లీ సినిమాలలోకి రీ ఎంట్రీ ఇచ్చారు. ఇటు రీఎంట్రీలో కూడా వరుస సినిమాలలో నటిస్తూ మరింత బిజీ ఆర్టిస్టుగా మారిపోయారు. అంతేకాదు ఈయన నటించిన ఎన్నో చిత్రాలు అటు ఓటీటీలలో కూడా మంచి రేటింగ్ సొంతం చేసుకుంటున్నాయి అంటే బాబు మోహన్ కి జనరేషన్ తో సంబంధం లేకుండా ఆదరణ ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

అలాంటి బాబు మోహన్ తాజాగా తనకు సభా గౌరవం ఇవ్వలేదని, ఆయనదే పెత్తనం ఉన్నప్పుడు తనను ఎందుకు పిలిచారు అంటూ అసహనం వ్యక్తం చేశారు. అసలు విషయంలోకి వెళ్తే ..మూవీ మొఘల్ డి రామానాయుడు స్థాపించిన రామానాయుడు స్టూడియోలో చింతామణి నాటకాన్ని ప్రదర్శించారు . అయితే ఈ నాటకంలో పాల్గొనాలని ఆయనకు ప్రత్యేక ఆహ్వానం అందింది. కాకపోతే పేదవారి కోసం ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్న సందర్భంగా తాను బిజీగా ఉండడం వల్లే ఈ నాటకంలో నటించడానికి పాల్గొనలేదు. కానీ గెస్ట్ గా వచ్చి వెళ్తానని చెప్పారట. ఇక అందులో భాగంగానే చింతామణి నాటకాన్ని వీక్షించడానికి గెస్ట్ గా విచ్చేశారు బాబు మోహన్.

అయితే తనకు ఒక నటుడిగా, మాజీ మంత్రిగా ఇవ్వాల్సిన గౌరవం లభించలేదు అని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే సభ పై బాబు మోహన్ మాట్లాడుతూ.. "అంకుశం , ఆహుతి సినిమాల తర్వాత నా కెరియర్ ఒక్కసారిగా మారిపోయింది. రోజుకు 5 షిఫ్ట్ లు అంటే తెల్లవారుజామున 4:00 గంటలకు షూటింగ్ మొదలుపెడితే సాయంత్రం 6 గంటల వరకు నేను పనిచేసిన రోజులు ఉన్నాయి. శ్యాంప్రసాద్ రెడ్డి , కోడి రామకృష్ణ ప్రోత్సాహం వల్లే నేను ఎన్నో చిత్రాలలో నటించగలిగాను. అలాగే డి రామానాయుడు నిర్మించిన ఎన్నో చిత్రాలలో ఆయన నాకు మంచి మంచి అవకాశాలు ఇచ్చారు. ఆయన మీద ఉన్న గౌరవంతోనే నేను ఇక్కడికి వచ్చాను. కానీ ఇక్కడ సురేష్ బాబు గారిదే పెత్తనం.. ఇంకెప్పుడు నన్ను ఇక్కడికి పిలవకండి.. ఆయన రామానాయుడు గారి కంటే పెద్దవారు" అంటూ తనకు సభా మర్యాద ఇవ్వలేదని అసహనం వ్యక్తం చేశారు బాబు మోహన్. ప్రస్తుతం ఆయన మాట్లాడిన వీడియోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇకపోతే తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ.." చింతామణి నాటకం అంటే నాకు చాలా ఇష్టం . ఈ నాటకం ప్రదర్శించినప్పుడు ఇంట్లో అమ్మానాన్నలకు కూడా చెప్పకుండా వెళ్లి తెల్లవార్లూ ఆ నాటకాన్ని చూసేవాడిని. అలాంటి చింతామణి నాటకంలో ఇప్పుడు నాకు అవకాశం వచ్చినా కొన్ని పనుల వల్ల నేను పాల్గొనలేకపోయాను" అంటూ తెలిపారు. ఏది ఏమైనా తనకు సరైన గౌరవం ఇవ్వలేనందునే తనకు అగౌరవంగా అనిపించిందని బాబు మోహన్ కామెంట్లు చేశారు.


Full View


Full View


Tags:    

Similar News