కాంజీవరం చీరలో మైండ్ బ్లాక్ చేసిన RRR సీతమ్మ
రామ్ చరణ్- జూనియర్ ఎన్టీఆర్ - అజయ్ దేవగన్ త్రయం నటించిన భారీ మల్టీస్టారర్ RRR విడుదలకు సమయమాసన్నమైంది. ఈ చిత్రం 2022 జనవరి 7న థియేట్రికల్ గా విడుదల కానుంది. ఇప్పటికే ప్రచారంలో వేగం పెంచింది జక్కన్న టీమ్. ఇటీవలే లాంచ్ అయిన ట్రైలర్ నిమిషాల్లోనే సంచలన వ్యూస్ తో రికార్డులు బ్రేక్ చేసింది.
ప్రస్తుతం చిత్రబృందం ప్రచారంలో బిజీ బిజీగా ఉంది. ఇటీవల చెన్నై- హైదరాబాద్ లో టీమ్ అంతా ప్రమోషనల్ ఈవెంట్ లో సందడి చేసింది. చెన్నై ఈవెంట్ కోసం అలియా భట్ సీ-గ్రీన్ కంజీవరం చీరను ధరించి టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచింది. పచ్చ చీరలో ఆలియా అందచందాలు మంత్రముగ్ధం చేశాయి. యూత్ ని కిల్ చేసింది అంటూ ప్రశంసలు దక్కాయి. ఈ పచ్చ రంగు చీరకు బంగారు ఎంబ్రాయిడరీ మరో ప్రధాన ఆకర్షణగా కనిపించింది. ఆకుపచ్చ రంగు స్లీవ్ లెస్ బ్లౌజ్ తో ఆలియా మ్యాచింగ్ సంథింగ్ స్పెషల్ అనే చెప్పాలి.
ఆలియా డిజైనర్ లుక్ ని తీర్చిదిద్దిన తీరు ఆకట్టుకుంది. ఆకుపచ్చ చీరకు తగ్గట్టుగానే ఆ తలలో తురిమిన మల్లెచెండు తన అందాన్ని పదింతలు పెంచిందని చెప్పాలి. తాజాగా తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ లో ఈవెంట్ నుండి ఫోటోలను పంచుకుంది. దానిని నెమలి ఎమోటికాన్ తో క్యాప్షన్ చేసింది.
RRR కాకుండా అలియా భట్ ఇతర సినిమాలతోనూ బిజీగా ఉంది. బ్రహ్మాస్త్ర విడుదలకు సిద్ధమవుతోంది. అలాగే సంజయ్ లీలా భన్సాలీ గంగూబాయి కతివాడిని కూడా విడుదల చేయడానికి టీమ్ సిద్ధమవుతోంది. ఈ చిత్రం 18 ఫిబ్రవరి 2022న థియేటర్లలో విడుదల కానుంది. మరోవైపు ప్రియుడు రణబీర్ ని ఆలియా పెళ్లాడేసే టైమ్ దగ్గరపడిందన్న గుసగుసలు వేడెక్కిస్తున్నాయ్.