స‌మంత ఒకే చెబితే గంగూబాయి సై!

Update: 2022-02-13 12:00 GMT
బాలీవుడ్ హీరోయిన్ అలియాభ‌ట్ పేరు టాలీవుడ్ లో  `ఆర్ ఆర్ ఆర్` రిలీజ్ కి ముందే మారుమ్రోగిపోతుంది. ఎన్టీఆర్..రామ్ చ‌ర‌ణ్ తో ఫ‌న్నీ చిట్ చాట్ తో ఆడియ‌న్స్ కి బాగా ద‌గ్గ‌రైపోయింది. అటుపై ఎన్టీఆర్ -కొర‌టాల శివ సినిమాలో హీరోయిన్ గా ఎంపిక అవ్వ‌డం తో..ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో క‌లిసి న‌టిస్తాను అని స్టేట్ మెంట్ ఇవ్వ‌డం వంటివి చూస్తే  అలియా భ‌ట్ స్పీడ్ మాములుగా లేద‌నిపించింది. తాజాగా అలియా ముందుకు ఓ ఆస‌క్తిక‌ర ప్ర‌శ్న వెళ్లింది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ల‌లో ఎవ‌రు అంటే ఇష్ట‌మ‌ని ప్ర‌శ్నించ‌గా అలియా ఎవ‌రూ పేరు చెప్ప‌లేదు. కొంచెం స‌మ‌యం తీసుకుని స‌మంత పేరు చెప్పింది.

స‌మంత తో క‌లిసి న‌టించాల‌ని ఉంద‌ని తెలిపింది. `ఫ్యామిలీ మ్యాన్ -2`లో స‌మంత న‌ట‌న చూసి ఆశ్చ‌ర్య‌పోయాను. అవ‌కాశం వ‌స్తే ఆమెతో క‌లిసి థ్రిల్ల‌ర్  సినిమా చేయాల‌నుకుంటున్నా. ఆమె తో న‌టించ‌డం ఎంతో గొప్ప‌గా ఫీల‌వుతాను అని తెలిపింది. అలియాభ‌ట్ బాలీవుడ్ లో బిజీ న‌టి. నేరుగా అలియానే స‌మంత‌తో క‌లిసి న‌టిస్తాన‌ని చెప్పంది కాబ‌ట్టి స‌రైన స్ర్కిప్ట్ కుదిరితే ఆ కాంబినేష‌న్ సాద్య‌మే. మ‌రి స‌మంత‌-అలియా భ‌ట్ ఇమేజ్ కి త‌గ్గ స్ర్కిప్ట్  ఎప్పుడు సిద్ద‌మ‌వుతుందో. మ‌రి అలియా చూపించిన అభిమానం పై స‌మంత ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం.

ఇక అలియాభ‌ట్ సినిమాల విష‌యానికి వ‌స్తే  పాన్ ఇండియా చిత్రం `ఆర్ ఆర్ ఆర్` లో రామ్ చ‌ర‌ణ్ కు జోడీగా సీత పాత్ర‌లో న‌టిస్తోంది. ఆ పాత్ర లుక్ ఇప్ప‌టికే ప్రేక్ష‌కల్ని ఆక‌ట్టుకుంది. సీత‌మ్మ‌గా తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర‌వ్వ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.  ఇక బాలీవుడ్ లో `గంగూబాయి క‌తియావాడి`లో న‌టిస్తోంది. ఇటీవ‌లే సినిమా ట్రైల‌ర్ రిలీజ్ అయి సంచ‌ల‌న సృష్టించిన సంగ‌తి తెలిసిందే. గంగూబాయి పాత్ర‌లో అలియా ఆహార్యం ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంది. ఈ చిత్రంతో అలియాభ‌ట్  బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్ట‌డం ఖాయ‌మంటున్నారు. ఫిబ్ర‌వ‌రి 25న చిత్రం వ‌ర‌ల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది.
Tags:    

Similar News