మ‌గాళ్ల‌దే వాడ‌తానన్న అలియా

Update: 2015-11-03 07:58 GMT
ఆడవాళ్ల దేహం బ‌హు సుకుమారం. అందుకే వారికి దేహానికి త‌గ్గ‌ట్టుగానే కొన్ని వ‌స్తువుల్ని త‌యారు చేస్తుంటారు. స‌బ్బులు - దుస్తులు మొద‌లుకొని ప‌ర్‌ ఫ్యూమ్స్ వ‌ర‌కు లేడీస్‌ కి ప్ర‌త్యేకంగా ఉంటాయి. అయితే బాలీవుడ్ చిన్న‌ది అలియాభ‌ట్ మాత్రం  నేను మ‌గాళ్ల వ‌స్తువులే వాడ‌తానంటోంది. అన్నీ కాదులెండి. ప‌ర్‌ ఫ్యూమ్స్ మాత్రమేన‌ట‌.  కేవ‌లం మ‌గాళ్ల కోసం త‌యారు చేసిన ప‌ర్‌ ఫ్యూమ్స్‌ నే వాడ‌తానంటోంది. అది కూడా నెల‌కొక‌టి చొప్పున మారుస్తుంద‌ట‌. అదేంటి అని అడిగితే... నాకు సువాస‌న‌లంటే చాలా ఇష్టం.మ‌గాళ్ల‌కోసం త‌యారు చేసిన ప‌ర్‌ ఫ్యూమ్స్ కాస్త సువాస‌న‌తో కూడుకొని ఉంటాయని చెప్పుకొచ్చింది.

అది స‌రే మ‌గాళ్ల‌ల్లో మీకు న‌చ్చే విష‌యాలేంటి అని అడిగితే....  అందగాడు, డ‌బ్బున్నోడు కావాల్సిన అవ‌స‌రం లేదంటోంది. అత‌డికి శుభ్ర‌త తెలిస్తే చాలని చెప్పింది.  మంచి సువాస‌న‌లు వెద‌జ‌ల్లూతూ శుభ్రంగా ఉండే అబ్బాయిలంటేనే నాకిష్టం అని చెప్పుకొచ్చింది. త‌న స్టైల్ గురించి అలియా చెబుతూ... ఎప్పుడూ ఒకేలా ఉండ‌టం నాకే న‌చ్చ‌దు. చీటికిమాటికి నా స్టయిల్‌ ను మార్చేస్తూ ఉంటా. అదే న‌న్ను న‌లుగురిలో ప్ర‌త్యేకంగా నిల‌బెడుతుండొచ్చంది.  స్టూడెంట్ ఆఫ్ ది ఇయ‌ర్ చిత్రంతో వెలుగులోకి వ‌చ్చిందీ భామ‌. ఇటీవల శాందార్‌ లో పింక్ బికినీ వేసి అద‌ర‌గొట్టింది. సినిమా బాలేద‌నే టాక్ వ‌చ్చినా పొట్టిపిల్ల అలియా వేసిన బికినీ చూడ్డానికే కుర్ర‌కారు థియేట‌ర్‌ కి వెళ్లిపోయారు. అందుకే ఆ సినిమాకి మంచి వ‌సూళ్లే వ‌చ్చాయి.
Tags:    

Similar News