ట్రిపుల్ ధమకాకు రెడీ అవుతున్న అలియా?
గతంలో స్టార్ హీరోలు.. హీరోయిన్లు ఎక్కువ సినిమాల్లో నటించేవారు. దీంతో గ్యాప్ లేకుండా వారి సినిమాలు ప్రేక్షకులకు పలకరిస్తూ ఉండేవి. అయితే ఇప్పుడు గతంలో చేసినట్టు స్టార్లు ఎక్కువ సినిమాలలో నటించడం లేదు. హీరోలైతే ఏడాదికి ఒకటి. హీరోయిన్లయితే రెండో మూడో సినిమాలతో సరిపెట్టుకుంటున్నారు. ఇక ఒక సినిమాకు మరో సినిమాకు మధ్య గ్యాప్ కూడా ఉంటుంది. అయితే బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ మాత్రం ఈ విషయంలో డిఫరెంట్ గా ఉంది.
అలియా ప్రస్తుతం దాదాపు అర డజను క్రేజీ ప్రాజెక్టులలో నటిస్తోంది. అలియా నటించే సినిమాల్లో 'ఇన్షా అల్లా'.. 'సడక్ 2'.. 'RRR' కూడా ఉన్నాయి. చిత్రమైన విషయం ఏంటంటే ఈ మూడు సినిమాలను వచ్చే ఏడాది జూలై లోనే రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ మూడు సినిమాల విడుదల తేదీలు జూలై 10 నుండి జూలై 31 లోపు ఉన్నాయి. మరి చివరి నిముషంలో మార్పు చేర్పులు ఉంటాయేమో తెలియదు కానీ ప్రస్తుతానికి మాత్రం మూడు సినిమాల విడుదల జులైలోనే. అలా కనుక రిలీజ్ అయితే ఇదో రికార్డ్ అవుతుంది. మూడు భారీ ప్రాజెక్టులు ఒకే నెలలో రిలీజ్ కావడం నిజంగా అరుదైన విషయమే కదా?
ఈ సినిమాల్లో 'RRR' రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా. 'ఇన్షా అల్లా' సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందుతున్న చిత్రం. ఇంకా సెట్స్ మీదకు వెళ్ళలేదు. త్వరలోనే షూటింగ్ ప్రారంభం అవుతుంది. ఇక మూడవ చిత్రం సంజయ్ దత్ క్లాసిక్ ఫిలిం 'సడక్' కు సీక్వెల్ గా తెరకెక్కుతోంది. ఈ సినిమాలతో పాటుగా అలియా 'బ్రహ్మాస్త్ర' అనే సినిమాలో కూడా నటిస్తోంది.