'బాహుబలి'లో తమన్నా ఎలాగో.. 'ఆర్.ఆర్.ఆర్' లో అలియా అలాగా..!

Update: 2020-11-05 13:10 GMT
బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ 'ఆర్.ఆర్.ఆర్' సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ మల్టీస్టారర్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'కొమురం భీమ్' పాత్రలో నటిస్తుండగా.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'అల్లూరి సీతారామరాజు'గా కనిపించనున్నాడు. ఇందులో అలియా చరణ్‌ కు జోడిగా  నటిస్తుండగా.. తారక్ సరసన ఐరిష్ నటి ఒలివియా మోరిస్ నటించనుంది. ఇటీవలే 'ఆర్.ఆర్.ఆర్' షూట్ తిరిగి ప్రారంభమైన నేపథ్యంలో ఆలియా డిసెంబర్ నుంచి టీమ్ తో జాయిన్ అవుతుందని తెలుస్తోంది. ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం ఎప్పుడో అలియా పాత్ర షూటింగ్ కూడా కంప్లీట్ చేయాల్సి ఉంది. అయితే కరోనా లాక్ డౌన్ ప్రకటించడంతో షూటింగ్ లేట్ అవుతూ వచ్చింది.

కాగా, 'ఆర్.ఆర్.ఆర్' లో అలియా భట్ సీత పాత్రలో కనిపించనుందని తెలుస్తోంది. ఇందులో ఆమెను కొంత గ్లామర్ యాంగిల్ లో చూపించ‌డానికి రాజమౌళి ప్లాన్ చేసుకుంటున్నాడట. ఇంతకముందు 'బాహుబలి' సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా ను రొమాంటిక్ యాంగిల్ లో ఎలా చూపించాడో ఇక్కడ 'ఆర్.ఆర్.ఆర్'లో అలియా ను కూడా అలానే ప్రెజెంట్ చేయబోతున్నాడట. ఇందులో భాగంగా ఆలియా భట్‌ - రామ్‌ చరణ్‌ లపై ఓ సాంగ్‌ కూడా ఉంటుందట. ఈ సాంగ్‌ ను హిందీ వర్షన్ ఆలియా భట్‌ స్వయంగా ఆలపించనున్నారని వార్తలు వస్తున్నాయి. అలియా ఇంతకముందు 'హైవే' 'హంప్టీ శర్మకీ దుల్హనియా' చిత్రాల్లో సాంగ్స్ పాడిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా బాలీవుడ్ లో ఈ మధ్య అలియా పై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో 'ఆర్.ఆర్.ఆర్' సినిమాతో మళ్ళీ ట్రాక్ లోకి వస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
Tags:    

Similar News