• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  చరణ్ పక్కన నో చెప్పేసిన...

చరణ్ పక్కన నో చెప్పేసిన బ్యూటీ ?

By - Tupaki Desk
Update: 2019-03-11 07:49 GMT
ఆర్ ఆర్ ఆర్ అప్ డేట్స్ లో అన్నింటి కన్నా అభిమానులు ఎక్కువగా ఎదురు చూస్తున్న అంశం హీరొయిన్ల సెలక్షన్. ఇప్పటికీ రాజమౌళి వాటిని ఒక కొలిక్కి తీసుకురాలేదు. చరణ్ సరసన ఎవరు తారక్ జోడి ఏది ఇలా రెండు ప్రశ్నలతో ఫ్యాన్స్ సతమతమైపోతున్నారు. అయితే గత కొద్ది రోజులుగా చరణ్ సరసన బాలీవుడ్ భామ అలియా భట్ ని నటింపజేసేందుకు రాజమౌళి విశ్వప్రయత్నాలు చేస్తున్నాడన్న వార్తలు జాతీయ మీడియాలో సైతం షికారు చేశాయి.

దీని కోసం బాహుబలి హింది నిర్మాత అలియా భట్ గాడ్ ఫాదర్ గా భావించే కరణ్ జోహార్ ద్వారా రాజమౌళి రాయబారం నడిపించాడనే టాక్ వచ్చింది. అయితే లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం ఇందులో నటించేందుకు నిస్సహాయత వ్యక్తం చేసినట్టు సమాచారం. మ్యాటర్ రెమ్యునరేషన్ కాదని ఆల్రెడీ చేతిలో ఉన్న కమిట్మెంట్స్ కు ఇంకో సినిమాకు ఒక్క రోజు కాల్ షీట్ ఇచ్చే ఛాన్స్ కూడా లేదని సున్నితంగా చెప్పినట్టు సమచారం

అలియా భట్ నిజంగా ఇదే చెప్పి ఉంటే సహేతుకమైన కారణమే. ఎందుకంటే ఏప్రిల్ 19న విడుదల కానున్న కళంక్ కోసం భారీ స్థాయిలో ప్రమోషన్స్ లో అలియా పాల్గొనాల్సి ఉంది. ఆ తర్వాత నాన్న మహేష్ భట్ తీసే సడక్ 2 షూటింగ్ ఉంటుంది. అక్కడితో అయిపోలేదు. మరో మల్టీ స్టారర్ తక్త్ డేట్స్ పెండింగ్ లో ఉంటాయి.

ఇవి కాకుండా అశ్వని అయ్యర్ ప్రాజెక్ట్ కూడా చర్చల్లో ఉంది. ఇంత టైట్ షెడ్యూల్ లో అలియా ఆర్ ఆర్ ఆర్ కు బల్క్ డేట్స్ ఇవ్వడం జరగని పని. అందుకే చరణ్ పక్కన చేసే ఛాన్స్ వచ్చినా నో చెప్పడం తప్ప అలియా భట్ కు ఇంకో ఆప్షన్ దొరకలేదని బాలీవుడ్ టాక్. సో జక్కన్న మళ్ళి వేట మొదలెట్టాల్సిందే
Tags:    
  • Alia Bhatt 
  • RRR Movie 
  • telugu News 
  • ram charan 
  • Rajamouli 

Similar News

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

Copyright @2026

Powered by Blink CMS