ఫోటో స్టోరి: కొత్త పోజ్ చూడయా

Update: 2017-02-06 07:17 GMT
బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఆలియా భట్ మంచి జోరు మీదుంది. మహేష్ భట్  వారసురాలిగా ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ భామ.. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకోవడంలో సక్సెస్ అయింది. వరుసగా సినిమాలు చేసేయడమే కాదు..విభిన్నమైన పాత్రలతో అలరిస్తూ దూసుకుపోతోంది ఆలియా భట్. మరోవైపు గ్లామర్ యాంగిల్ లో కూడా రోజు రోజుకూ రెచ్చిపోతోంది ఈ కుర్ర బ్యూటీ.

తాజాగా ఓ ఫోటో షూట్ కోసం అమ్మడు బ్లూ థీమ్ తో ఇచ్చిన పోజ్ అదిరిపోయింది. లోపల్ బ్లాక్ బ్రా.. స్లీవ్ లెస్ డెనిమ్ టాప్.. డిజైనర్ ఫ్రంట్ ఓపెన్ బాటమ్ తో ఓ చేతిని గోడకు ఆనించి.. ఆలియా ఇచ్చిన పోజ్ సూపర్బ్ గా ఉంది. స్టైలింగ్ అంటే సైడ్ కట్స్ ఇప్పటివరకూ చాలామంది చూపించారు కానీ.. ఈ భామ ఏకంగా చెంగుచెంగుమనిపించేలా ఉన్న తన కాళ్లను పూర్తిగా చూపించేలా.. ఫ్రంట్ ఓపెన్ డిజైన్ తో చెలరేగిపోయింది. మరోవైపు.. కొద్దికొద్దిగా కనిపిస్తోన్న క్లీవేజ్ అందాలు ఈ ఫోటోలో ఫ్యాన్స్ కి స్పెషల్ బోనస్.

గతేడాది నుంచి ఈ భామ కెరీర్ తెగ పరుగులు పెట్టేస్తోంది. 2016 లో కపూర్ అండ్ సన్స్.. ఉడ్తా పంజాబ్.. యే దిల్ హై ముష్కిల్ లో కేమియో.. డియర్ జిందగీ అంటూ అన్ని సినిమాలతోను మంచి హిట్స్ అందుకుంది ఆలియా. ప్రస్తుతం బద్రీనాథ్ కి దుల్హనియాని రిలీజ్ చేసేందుకు రెడీగా ఉందీ భామ. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్.. యూట్యూబ్ లో సెన్సేషన్స్ సృష్టిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News