ఫోటో స్టోరి: పసుపు చీరలో కత్తిలా ఉందే

Update: 2016-08-11 11:47 GMT
బాలీవుడ్ లో ఇప్పుడు ''రుస్తుం'' సినిమా కోసం జనాలు తెగ కష్టపడుతున్నారు. ముఖ్యంగా సెలబ్రిటీలు అయితే తెగ ప్రమోట్ చేస్తున్నారు. ఒక్కొక్కరూ ఈ సినిమా కోసం ఏదో ఒక వీడియోను రికార్డు చేసి దానిని సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తున్నారు. సోనాక్షి సిన్హా, సోనమ్ కపూర్ వంటి భామలు తమ కిక్కిచ్చే వీడియోలతో ఇప్పటికే అలరించారు. ఇప్పుడు ఆలియా భట్ కూడా తన వంతుగా ఒక వీడియో పెట్టింది.

తన నాజూకైన బాడీకి నప్పేలా ఒక పసుపు రంగు చీర కట్టుకుని.. అమ్మడు రవీనా టాండన్ ను గుర్తుకుతెచ్చింది. ఎందుకంటే ఇప్పుడు అక్షయ్ కుమార్ పాపులర్ సాంగ్ టిప్ టిప్ బర్సాకు అమ్మడు స్టెప్పులు వేసింది. ఆ పసుపు రంగు చీరలో సోయగాలను చూపించడం ఒకెత్తయితే.. అబ్బో స్టెప్పులు కూడా కిక్కొచ్చేలా వేయడం మరొక ఎత్తు. అయితే మధ్యలో స్టెప్పులు ఆపేసి.. నన్నేం చూస్తారు వెళ్ళి రుస్తుం సినిమా చూడండి అంటోంది అమ్మడు. మొత్తానికి సినిమా ప్రమోషన్ అంతా ఒకెత్తయితే.. ఈ ఆలియా ఇచ్చే హాట్ కిక్ ఇంకో ఎత్తు.

ఇంతమంది ప్రమోట్ చేసిన రుస్తుం సినిమా రిజల్టు ఎలా ఉంటుందో తెలియాలంటే.. రేపటి వరకు వెయిట్ చేయాల్సిందే. ఈ శుక్రవారం బాలీవుడ్లో అక్షయ్ కుమార్ రుస్తుం.. హృతిక్ రోషన్ మొహంజొదారో సినిమాలు విడుదలవుతున్నాయి. అది సంగతి.

Full View
Full View
Tags:    

Similar News