RRR సీత‌మ్మ‌ వంట గ‌ది క‌ష్టం ఏమిటో

Update: 2019-12-07 12:31 GMT
ఆర్.ఆర్.ఆర్ లాంటి పాన్ ఇండియా ఛాన్స్ కొట్టేసింది కుర్ర‌బ్యూటీ ఆలియా భ‌ట్. ఈ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్‌  స‌ర‌స‌న న‌టిస్తోంది. అల్లూరి స‌తీమ‌ణి సీత‌గా అభిమానుల ముందుకు వ‌స్తోంది. మెగా ఫ్యాన్స్ లో ఈ భామ క్రేజు మామూలుగా లేదిప్పుడు. ఇటీవ‌లే ఆర్ఆర్ఆర్ టీమ్ తో జాయిన్ అయింది. జ‌క్క‌న్న అండ్ టీమ్ ఈ భామ‌పై కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నారు.

అయితే నిరంత‌రం అదే బిజీ అంటే ఎలా?  వీలు చిక్కిన‌ప్పుడు ఇదిగో ఇలా ఆట‌విడుపుగా క‌నిపించింది. అందాల అలియా వంట‌ గందిలో కెమారాకు దొరికింది. నిది నిజంగానే అభిమానులకు పెద్ద షాక్. వంట చేయాల్సినంత అవ‌స‌రం ఏమిట‌ట‌? మ‌హేష్ భ‌ట్ వార‌సురాలిగా బాలీవుడ్ యువ‌రాణిగా.. గోల్డెన్ స్పూన్ క్వీన్ గా వెలిగిపోతున్న ఈ అమ్మ‌డు కోరుకుంటే కొండ‌మీంచి కోతినే దించేస్తారు. కానీ ఈ వంట ఏమిటో! అంటూ సందేహించారంతా. అయితే అలియాకి ఆరోగ్యం విష‌యంలో ఉన్న శ్ర‌ద్ధ అలాంటిది.ఎలాంటి ప‌రిస్థితిలో ఉన్నా.. అలియా భ‌ట్ త‌న‌కు కావాల్సిన తినుబండారాలు తానే స్వ‌యంగా త‌యారు చేసుకుంటుంద‌ట‌. ప‌నివాళ్ల సాయంతో ద‌గ్గ‌రుండి రెడీ చేయించుకుంటోంది.

ఉద‌యం టిఫిన్ మొద‌లు..రాత్రి భోజ‌నం వ‌ర‌కూ అంతా ఇంట్లోనే. ఎప్పుడైనా ఔట్ డోర్ షూటింగ్ ల‌కు వెళితే త‌ప్ప  ఏ స‌మ‌యంలో ఎంత తినాలి? అనే దానిపై అమ్మ‌డికి కొన్ని లెక్క‌లు ఉంటాయిట‌. టైమ్ టేబుల్ ని తూచ త‌ప్ప‌కుండా ఆచ‌రిస్తుందిట‌. ఇంత‌ ఫిట్ గా ఉండ‌టానికి కార‌ణం త‌న ఇంటి ఫుడ్డే కార‌ణ‌మ‌ట‌. ఫుడ్ కి సంబంధించి సొంతంగా ఓ యూట్యూబ్ ఛానెల్ ని కూడా ర‌న్ చేస్తోందిట‌. అలాగే త‌న స్టాప్ ని త‌న ఇంట్లో  కుంటుంబ స‌భ్యుల్లా చూసుకునే మంచిత‌నం త‌న‌కు ఉంది.


Full View


Tags:    

Similar News