• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అతడి గత అఫైర్స్‌ను...

అతడి గత అఫైర్స్‌ను పట్టించుకోను

By - Tupaki Desk
Update: 2019-06-24 11:30 GMT
బాలీవుడ్‌ క్యూట్‌ బ్యూటీ ఆలియా భట్‌ గత కొంత కాలంగా యంగ్‌ హీరో రణ్‌ బీర్‌ కపూర్‌ తో ప్రేమలో ఉన్న విషయం తెల్సిందే. వీరిద్దరి ప్రేమ వ్యవహారం చాలా దూరం వెళ్లింది. ఇరు కుటుంబాల వారు వీరికి ఎప్పుడు ఓకే అయితే అప్పుడు పెళ్లి చేసేందుకు సిద్దంగా ఉన్నారు. అయితే ఇద్దరు కూడా కెరీర్‌ పరంగా చాలా బిజీగా ఉన్న కారణంగా పెళ్లికి నో చెబుతూ వస్తున్నారు. పెళ్లి మాట ఎత్తితే కస్సుమంటున్న ఆలియా భట్‌ తన ప్రియుడు రణ్‌ బీర్‌ కపూర్‌ గురించి మాత్రం మాట్లాడేందుకు వెనకాడటం లేదు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆలియా భట్‌ మాట్లాడుతూ... ప్రస్తుతం మేమిద్దరం కూడా చాలా మంచి జీవితాన్ని గడుపుతున్నాం. నా జీవితంలోకి రణ్‌ బీర్‌ రావడంతో నేను చాలా సంతోషంగా ఉంటున్నాను. అతడు వచ్చి నా జీవితాన్ని కొత్తగా చేయడంతో పాటు.. నా జీవితంలో సంతోషాన్ని నింపాడు. గతంలో అతడికి ప్రేమ వ్యవహారాలు ఉన్న విషయం వాస్తవమే. అయితే నేను ఆ అఫైర్స్‌ గురించి పట్టించుకోను. ఎందుకంటే నాకు కూడా గతంలో అలాంటి అఫైర్లు ఉన్నాయి కదా అంటూ చాలా లైట్‌ గా సమాధానం చెప్పింది.

ప్రస్తుతం బాలీవుడ్‌ లో రెండు మూడు సినిమాలు చేస్తున్న ఆలియా భట్‌ తెలుగులో కూడా ఒక చిత్రాన్ని చేస్తున్న విషయం తెల్సిందే. తెలుగులో ఈ అమ్మడు రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్‌ ఆర్‌ ఆర్‌' చిత్రంలో రామ్‌ చరణ్‌ కు జోడీగా నటిస్తోంది. బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ గా గుర్తింపు దక్కించుకున్న ఈ అమ్మడు త్వరలోనే రణ్‌ బీర్‌ కపూర్‌ ను వివాహం చేసుకోవడం కన్ఫర్మ్‌ అని బాలీవుడ్‌ వర్గాల వారు అంటున్నారు.
Tags:    
  • Alia Bhatt 
  • Ranbir Kapoor 
  • Telugu News 
  • Latest Updates 

Similar News

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

ఈ దీపావళికి పెద్దగా సౌండ్ చేయలేకపోయిన టాలీవుడ్!

2026-11-05 07:27 GMT

కీర్తి సురేష్.. మరోసారి లెక్క తప్పిందా..

2026-11-05 07:23 GMT

సంక్రాంతి బాక్సాఫీస్ రేసు - 1000 కోట్ల బిజినెస్ అంచనా!

2026-11-05 07:21 GMT

తరుణ్ భాస్కర్.. నెక్స్ట్ ఆ హీరో దగ్గరికేనా!

2026-11-05 07:17 GMT

రహస్యం బయటపెట్టిన భాగ్యశ్రీ.. ఆ టాలెంట్ కూడా ఉందా?

2026-11-05 07:03 GMT

Copyright @2026

Powered by Blink CMS